సన్రే రిసార్ట్ వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘనస్వాగతం పలుకుతున్న ప్రజలు
‘అల్లూరి’ ఎయిర్పోర్ట్ మొదలు సన్రే రిసార్ట్ వరకు జైజగన్ నినాదాలు
గూడపువలస వద్ద హోరెత్తిన అభిమానం
నూతన దంపతులకు ఆశీర్వాదం
పూసపాటిరేగ: విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం మొదలు సన్రే రిసార్ట్ వరకు రోడ్డుకు ఇరు వైపులా భారీ జనసందోహం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం పలికింది. బుధవారం సన్రే రిసార్ట్లో జరిగిన వైఎస్సార్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఉప్పాడ శివారెడ్డి, తనూజాల వివాహానికి విచ్చేసిన జననేత వధూవరులను ఆశీర్వదించారు.

అంతకు ముందు విమానాశ్రయం ముఖ ద్వారం నుంచే వైఎస్ జగన్కు దారిపొడవునా ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. సన్రే రిసార్ట్కు వెళ్లేంత వరకు దారి పొడవునా అభిమానులకు అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. గూడపువలస కూడలి, రాయివలస లేఅవుట్, సన్రే ముఖద్వారం వద్ద వేలాది మంది అభిమానులు రహదారిపైకి వచ్చి జై జగన్ అంటూ నినాదాలు చేశారు. సన్రే రిసార్టు పరిసరాలు జనసందోహంతో కిక్కిరిశాయి. సన్రే రిసార్ట్లో 500 మంది మహిళలు కోలాటం చేస్తూ.. పూలు చల్లుతూ స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, బొత్స ఝాన్సీలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనరసయ్య, కరణం ధర్మశ్రీ, గొర్లె కిరణ్కుమార్, వైఎస్సార్సీపీ నెల్లిమర్ల నియోజకవర్గం సమన్వయకర్త గదల సన్యాసినాయుడు, పార్టీ నేతలు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి, కె.కె.రాజు,పతివాడ అప్పలనాయుడు, పిన్నింటి తమ్మునాయుడు, బొత్స చైతన్యబాబు, పతివాడ సత్యనారాయణ, మహంతి జనార్దనరావు, రేగాని శ్రీనివాసరావు, సుందర హరీష్ తదితరులు పాల్గొన్నారు.


