‘గోల్డ్‌’ పుస్తకావిష్కరణ | Jos alukkas autobiography gold launched in thrissur | Sakshi
Sakshi News home page

దేశ బంగారం రాజధాని నుంచి నా వ్యాపార ప్రయాణం..

Apr 16 2025 7:33 PM | Updated on Apr 16 2025 7:47 PM

Jos alukkas autobiography gold launched in thrissur

త్రిసూర్‌: జోస్‌ అలుక్కాస్‌ గ్రూప్‌ చైర్మన్‌ ‘జోస్‌ అలుక్కాస్‌’ జీవిత చరిత్రపై రూపొందించిన ‘గోల్డ్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమం త్రిసూర్‌లోని లూలూ హయాత్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘనంగా జరిగింది. కేంద్ర మంత్రి మంత్రి సురేష్‌ గోపి దీన్ని ఆవిష్కరించారు. తొలి కాపీని కేరళ రెవెన్యూ మంత్రి కే. రాజన్‌కు అందజేశారు.

‘‘భారతదేశ బంగారం రాజధాని త్రిసూ ర్‌ నుంచి నా వ్యాపార ప్రయాణం ప్రారంభమైంది. 81 ఏళ్ల జీవితం వ్యక్తిగతమైనది మా త్రమే కాదు, భారతీయ ఆభరణాల వ్యాపార చరిత్ర.  ఈ పుస్తకం నేనేమిటో తెలియజేసిన కథ. ఇది త్రిసూర్‌ కథ కూడా..’’ అని జోస్‌ అలుక్కాస్‌ అన్నారు.

పుస్తకానికి ముందుమాట మలయాళ నవలా రచయిత టీ.డీ.రామకృష్ణన్‌ రాశారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జోస్‌ అలుక్కాస్‌ ప్రచారకర్త, ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ ఆర్‌.మాధవన్, కేరళ విద్యా శాఖ మంత్రి ఆర్‌. బిందు ఇతర రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement