భారతీయ టెలికాం రంగంలో సరికొత్త విప్లవానికి రిలయన్స్ జియో నాంది పలికింది. సామాన్యుడికి సైతం ప్రీమియం వినోదాన్ని చేరువ చేస్తూ.. కేవలం రూ.200 ధరతో ‘జియో ఓటీటీ పాస్’ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఒక్క 28 రోజుల ప్యాక్‌తో 15 టాప్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల యాక్సెస్, 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్, 30 జీబీ హై-స్పీడ్ డేటాతో పాటు అపరిమిత 5జీ సేవలను అందిస్తూ వినియోగదారులపై ఆఫర్ల వర్షం కురిపించింది.
నేటి (మే 27, 2026) నుంచే ఈ సరికొత్త పాస్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టెలికాం సర్కిళ్లలో అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. యాక్టివ్ బేస్ ప్లాన్ ఉన్న జియో వినియోగదారులందరూ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్గాల ద్వారా దీనిని పొందవచ్చని కంపెనీ తెలిపింది.
రూ.1,500 విలువైన ప్రయోజనాలు..
ప్రస్తుత డిజిటల్ కాలంలో విడివిడిగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు తీసుకోవాలంటే నెలకు వందల రూపాయల భారం పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు ఆర్థికంగా భారీ ఉపశమనం కలిగించేలా జియో ఈ ఎంటర్‌టైన్‌మెంట్ పాస్‌ను డిజైన్ చేసింది. కేవలం రూ.200లకే లభించే ఈ ప్యాక్ ద్వారా వినియోగదారులు నెలకు సుమారు రూ.1,500 విలువైన ప్రయోజనాలను ఉచితంగా పొందడం విశేషం. వీడియో స్ట్రీమింగ్, లైవ్ టెలివిజన్, హై-స్పీడ్ కనెక్టివిటీల కలయికగా ఈ ప్లాన్ నిలుస్తోందని కంపెనీ చెప్పింది.
15 ప్రీమియం ఓటీటీలు..
యూట్యూబ్ ప్రీమియం: టీవీ, టాబ్లెట్, మొబైల్ పరికరాల్లో ప్రకటనలు లేని (యాడ్స్ ఫ్రీ) స్ట్రీమింగ్, బ్యాక్‌గ్రౌండ్ ప్లే, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్స్ సౌకర్యం.
జియోహాట్‌స్టార్ మొబైల్ ప్లస్ హాలీవుడ్: లైవ్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ ఒరిజినల్స్, బ్లాక్‌బస్టర్ హాలీవుడ్ కంటెంట్ వీక్షించే అవకాశం.
అమెజాన్ ప్రైమ్ వీడియో(మొబైల్ ఎడిషన్): మొబైల్ పరికరాల్లో ప్రైమ్ వీడియో కంటెంట్ యాక్సెస్.
జీయో టీవీ ద్వారా మరో 12 ప్రముఖ ఓటీటీలు..
SonyLiv, ZEE5, Lionsgate Play, Discovery+, Sun NXT, FanCode, Kanccha Lannka, Planet Marathi, Chaupal, Hoichoi, TimesPlay, Tarang Plus.
150+ పెయిడ్ ఛానెల్స్ ఉచితం!
వినోదంతో పాటు సమాచారాన్ని అందించేందుకు జియో టీవీ ద్వారా 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్‌ను ఈ ప్యాక్‌లో చేర్చారు. ఇందులో ప్రముఖ బ్రాడ్‌కాస్టర్లకు చెందిన 150కు పైగా ప్రీమియం పెయిడ్ ఛానెల్స్ ఉండటం విశేషం. వాటిలో కొన్ని ప్రముఖ ఛానెళ్లు.. స్టార్‌ప్లస్ హెచ్‌డీ, కలర్స్ హెచ్‌డీ, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్, సెట్ హెచ్‌డీ, సోనీ సాబ్ హెచ్‌డీ, సన్ టీవీ నెట్‌వర్క్, కేటీవీ హెచ్‌డీ, వార్నర్ బ్రోస్, డిస్కవరీ.. వంటివి ఉన్నాయి.

అపరిమిత 5జీ యాక్సెస్
వినోదానికి నెట్‌వర్క్ అంతరాయం కలగకుండా ఈ పాస్ ద్వారా 30 జీబీ హై-స్పీడ్ 4G/5G డేటా లభిస్తుంది. అంతేకాదు, వినియోగదారుడి యాక్టివ్ బేస్ ప్లాన్ చెల్లుబాటు కాలం వరకు అపరిమిత 5జీ కనెక్టివిటీని జియో ఆఫర్ చేస్తోంది. ఈ పాస్ గరిష్టంగా 28 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది.
ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు


