30 రోజుల రీచార్జ్‌ ప్లాన్‌లు.. బెనిఫిట్‌లు | Jio And Airtel Plans With 30 Days Validity Check About Service And Price Details Of Plans Inside | Sakshi
Sakshi News home page

30 రోజుల రీచార్జ్‌ ప్లాన్‌లు.. బెనిఫిట్‌లు

Jun 25 2025 9:40 PM | Updated on Jun 26 2025 12:11 PM

Jio and Airtel plans with 30 days validity check service and price

జియో, ఎయిర్‌టెల్ దేశంలో రెండు అతిపెద్ద టెలికాం కంపెనీలు. దేశంలో ఎక్కువ మంది మొబైల్ వినియోగదారులు జియోతో కనెక్ట్ అయ్యారు. యూజర్ల పరంగా ఎయిర్ టెల్ రెండో స్థానంలో ఉంది. ఎక్కువ మంది యూజర్లు నెలవారీ రీచార్జ్‌ ప్లాన్‌ల వైపు మొగ్గుచూపుతుంటారు. రెండు కంపెనీలు తమ వినియోగదారులకు సరసమైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి.

జియో, ఎయిర్‌టెల్‌లో ఉన్న 30 రోజుల వాలిడిటీ రీఛార్జ్ ప్లాన్‌లు, వాటి ప్రయోజానాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..  రూ.335తో జియో 30 రోజుల వాలిడిటీ రీఛార్జ్ చేసుకోవచ్చు. అదే సమయంలో, మీరు ఎయిర్‌టెల్ 30 రోజుల వాలిడిటీ రీఛార్‌ ప్లాన్‌ రూ .379కు అందుబాటులో ఉంది. ఈ రెండు రీఛార్జ్ ప్లాన్ల ధరలలో వ్యత్యాసం రూ .44. అలాగే వాలిడిటీ ఒక్కటే అయినా ప్రయోజనాల్లోనూ చాలా తేడాలున్నాయి.

జియో రూ.335 ప్లాన్
జియో రూ.335 ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. ఈ ప్లాన్లో వినియోగదారులు అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. దీంతో పాటు రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లతో పాటు మొత్తం 25 జీబీ డేటా లభిస్తుంది. అంతేకాకుండా జియో హాట్‌స్టార్, జియో క్లౌడ్‌కు ఉచిత యాక్సెస్ కూడా పొందుతారు.

ఎయిర్‌టెల్ రూ.379 ప్లాన్
ఎయిర్ టెల్ రూ.379 ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. ఈ ప్లాన్లో వినియోగదారులు అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. దీంతో పాటు రోజుకు 2 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఇది కాకుండా, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌నకు యాక్సెస్ కూడా పొందుతారు.

👉 ఇది చదివారా? జియో నుంచి 2 కొత్త ఫ్లాన్లు.. ప్రత్యేక బెనిఫిట్లు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement