ఐటీ ఉద్యోగుల జేబులు ఖాళీ అవుతున్నాయ్‌..

IT professionals pay cheques are falling more because - Sakshi

ప్రపంచవ్యాప్తంగా కొన్ని నెలలుగా ఐటీ ఉద్యోగుల జేబులు ఖాళీ అవుతున్నాయి. అంటే జీతాలు తగ్గిపోతున్నాయి. ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌ల ప్రకారం.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణులకు జీతం ఆఫర్లు 30 నుంచి 40 శాతం తగ్గాయి. 

అంతర్జాతీయ స్థూల ఆర్థిక మార్పులు, ఐటీ రంగం మందగమనం నేపథ్యంలో ఈ పతనం ఏడాది క్రితమే మొదలైందని పరిశ్రమలో ఉన్నతస్థాయి ఉద్యోగులు ఎకనామిక్ టైమ్స్‌తో చెప్పారు. కొన్ని పెద్ద టెక్ కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకోవడానికి ప్రయత్నించడంతో కొన్ని నెలల క్రితం మార్పు ప్రారంభమైంది. 2021-2022లో కోవిడ్ మహమ్మారితో ఉద్యోగ నియామకాల స్తంభనకు దారితీసిన తర్వాత తక్కువ పే ప్యాకర్లు సాధారణంగా మారిపోయాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం సిరీస్ A ఫండింగ్‌ని దాటిన ప్రారంభ దశ స్టార్టప్‌ల ద్వారానే చాలా వరకు నియామకాలు జరుగుతున్నాయని ఓ నిపుణుడు చెప్పినట్లుగా నివేదక పేర్కొంది. “ఐటీ కంపెనీలు మళ్లీ నియామకాలు ప్రారంభించాయి. అయితే మునుపటి సంవత్సరాల మాదిరిగా కాకుండా నియామకాల​లో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి" అని ఆ ఎక్స్‌పర్ట్‌ తెలిపారు.

మంచి టెక్ టాలెంట్ ఉన్న చాలా మంది  ప్రస్తుతం మార్కెట్‌లో వాస్తవిక వేతనాలతో అందుబాటులో ఉన్నారని, అలాంటి కొంతమంది నిపుణులను తాము నియమించుకుంటున్నట్లు ఐవీక్యాప్ వెంచర్స్ వ్యవస్థాపకుడు విక్రమ్ గుప్తా తెలిపారు. పెద్ద సంఖ్యలో సీనియర్ టెక్ టాలెంట్‌లను స్టార్టప్‌లు ఎంపిక చేసుకుంటున్నాయని కార్న్ ఫెర్రీ ఇండియా ఎండీ నవనిత్ సింగ్ చెబుతున్నారు.

ఉద్వాసనకు గురైన, పెద్ద టెక్ కంపెనీలు, స్టార్టప్‌లతో కలిసి పనిచేసిన అభ్యర్థులతో తాము మాట్లాడుతున్నామని, వారు 30 శాతం వరకు తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మైఖేల్ పేజ్ హెడ్, రీజినల్ డైరెక్టర్ ప్రన్షు ఉపాధ్యాయ్ పేర్కొన్నారు.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top