
రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అధినేత, భారత అపర సంపన్నుడు ముకేశ్ అంబానీ ( Mukesh Ambani), నీతా అంబానీల (Nita Ambani) ముద్దుల తనయ ఇషా అంబానీ. వీరి నుంచే వ్యాపార పటిమను అలవరచుకున్న ఈమె రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌లోని పలు అనుబంధ విభాగాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఆమె చాలా కాలంగా వీక్లీ క్లాసులకు వెళ్తున్నారు.
ఇషా అంబానీ క్లాసులకు వెళ్తున్నది తన కోసం కాదు.. తన ఇద్దరు కవల పిల్లలు కృష్ణ, ఆదియా శక్తి కోసం. పిల్లల మెదడు సంపూర్ణ ఎదుగుదల కోసం వారిని ప్రత్యేక తరగతులకు పంపుతున్నారు. పిల్లలతో తానూ ఓపిగ్గా ఆ తరగతులకు హాజరుతున్నారు. ఈ విషయాన్ని క్లాసులు నిర్వహించే టాకిల్ రైట్ అనే సంస్థ వ్యవస్థాపకురాలు వెల్లడించారు.
టికిల్ రైట్ ఫౌండర్ మునీరా సాహెబ్ దత్తానీ మాట్లాడుతూ ఇషా అంబానీ (Isha Ambani).. తన కవలలు ఆరు నెలల వయస్సు నుండి తమ తరగతులకు హాజరవుతున్నారని వెల్లడించారు. పిల్లల కోసం సమయాన్ని కేటాయించి ఇషా చూపుతున్న చొరవను ఆమె ప్రశంసించారు. ఈ సందర్భంగా తరగతుల గురించి ఆమె అనుభవాన్ని ఇషా అంబానీ వివరించారు. తనతోపాటు పిల్లలు ఆదియా, కృష్ణ క్లాస్‌లను ఆస్వాదిస్తారని చెప్పారు.
ఇదీ చదవండి: జియో పేమెంట్స్ బ్యాంక్ వినూత్న అకౌంట్
ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ వ్యాపారాలకు, ఫౌండేషన్‌కు డైరెక్టర్‌గా ఉన్న ఇషా అంబానీ, 2018 డిసెంబరులో ఆనంద్ పిరమల్‌ను వివాహమాడారు. ఈ జంట 2022 నవంబర్ 19న కవలలకు జన్మనిచ్చారు. వీరికి ఆదియా శక్తి, కృష్ణ అని పేర్లు పెట్టారు. వీరికి ఐవీఎఫ్ ద్వారా ఈ పిల్లలు కలిగారు. ఈ విషయాన్ని ఎటువంటి సంకోచం లేకుండా ఇషా అంబానీ చెబుతుంటారు.