
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ అయిన జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (Jio Payments Bank) 'సేవింగ్స్ ప్రో' పేరుతో సరికొత్త సేవింగ్స్ అకౌంట్‌ను ప్రవేశపెట్టింది. ఖాతాలోని నిధులు ఊరికే పడిఉండకుండా ఓవర్నైట్ మ్యూచువల్ ఫండ్స్ 'గ్రోత్' ప్లాన్లలో ఆటోమేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్ల ద్వారా పెట్టుబడులు పెట్టడం ఈ అకౌంట్ వినూత్న ప్రత్యేకత.
ఇప్పటికే జియో పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్ ఉన్న ఖాతాదారులు కేవలం కొన్ని క్లిక్‌లతో తమ ఖాతాను సేవింగ్స్ ప్రో (Savings Pro) ఖాతాకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆటో-ఇన్వెస్ట్ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే..
» ఖాతాదారులు తమ అకౌంట్‌లో బ్యాలెన్స్‌కు ఒక పరిమితిని నిర్ణయించుకుంటారు. ఇది కనీసం రూ .5,000 ఉంటుంది.
» ఈ పరిమితి కంటే ఎక్కువగా ఖాతాలో ఎంత మొత్తం ఉన్నా అది తక్కువ రిస్క్ ఉండే ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడికి ఆటోమేటిక్‌గా వెళ్తుంది.
» ఈ సదుపాయం ద్వారా కస్టమర్లు రోజుకు రూ .1,50,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. సెబీ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రిడంప్షన్లు ప్రాసెస్ చేస్తారు.
» కస్టమర్లు తమ పెట్టుబడులలో 90 శాతం వరకు తక్షణమే రీడీమ్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. గరిష్టంగా తక్షణ రిడంప్షన్ పరిమితి రూ .50,000. దీని కంటే ఎక్కువ కావాలంటే 1 నుంచి 2 పనిదినాల్లోగా రీడిమ్ చేసుకోవచ్చు.
» ఈ మొత్తం ప్రక్రియంతా జియో ఫైనాన్స్ యాప్ ద్వారా ఇటువంటి ఇబందులు లేకుండా పూర్తిగా డిజిటల్‌గా జరుగుతుంది.
» ఎంట్రీ లేదా ఎగ్జిట్ లోడ్లు, హిడెన్ ఛార్జీలు లేదా లాక్-ఇన్ పీరియడ్ వంటివేవీ ఉండవు.
ఇదీ చదవండి: అమెరికా పెంచితే మేం రద్దు చేస్తాం..!