
ఐపీఎల్ 2025 ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ సమయంలో కేవలం క్రికెట్ ఆటగాళ్లు, టీమ్ ఓనర్స్ గురించి మాత్రమే కాకుండా.. కెప్టెన్స్ ఎలాంటి కార్లను ఉపయోగిస్తారనే విషయాలను తెలుసుకోవడానికి కూడా కొందరు ఆసక్తి చూపుతారు. ఈ కథనంలో 2025 ఐపీఎల్ కెప్టెన్లు ఉపయోగించే ఖరీదైన కార్లు ఏవో చూసేద్దాం..
➤హార్దిక్ పాండ్యా (ముంబై ఇండియన్స్): రోల్స్ రాయిస్ ఫాంటమ్ (రూ. 9.50 కోట్లు)
➤శ్రేయాస్ అయ్యర్ (పంజాబ్ కింగ్స్): లంబోర్గిని హురాకాన్ ఈవీఓ స్పైడర్ (రూ. 3.73 కోట్లు)
➤పాట్ కమ్మిన్స్ (సన్‌రైజర్స్ హైదరాబాద్): ఫెరారీ 488 జీటీబీ (రూ. 3.68 కోట్లు)
➤మహేంద్ర సింగ్ ధోని (చెన్నై సూపర్ కింగ్స్): ఫెరారీ 599 జీటీఓ (రూ. 3.57 కోట్లు)
➤అజింక్య రహానే (కోల్‌కతా నైట్ రైడర్స్): మెర్సిడెస్ మేబ్యాచ్ జీఎల్ఎస్ 600 (రూ. 2.96 కోట్లు)
➤రిషబ్ పంత్ (లక్నో సూపర్ జెయింట్స్): ఆడి ఏ8 (రూ. 1.3 కోట్లు)
➤సంజు సామ్సన్ (రాజస్థాన్ రాయల్స్) రేంజ్ రోవర్ స్పోర్ట్ (రూ. 1.6 కోట్లు)
➤అక్షర్ పటేల్ (ఢిల్లీ క్యాపిటల్స్): మెర్సిడెస్ సీ క్లాస్ (రూ. 1 కోటి)
➤శుభ్‌మాన్ గిల్ (గుజరాత్ టైటాన్స్): మెర్సిడెస్ బెంజ్ ఈ350 (రూ. 75 లక్షల నుంచి రూ. 90 లక్షలు)
➤రజత్ పాటిదార్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు): హ్యుందాయ్ ఐ20 (రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షలు)
ఐపీఎల్ 2025 టీమ్ కెప్టెన్లలో ఖరీదైన కారును కలిగి ఉన్న వ్యక్తి 'హార్దిక్ పాండ్యా' అని స్పష్టమవుతోంది. ఈయన వద్ద ఉన్న రోల్స్ రాయిస్ ఫాంటమ్ అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఒకటి. దీని ధర రూ. 9.50 కోట్లు. ఆ తరువాత జాబితాలో శ్రేయాస్ అయ్యర్, పాట్ కమ్మిన్స్, ఎంఎస్ ధోని మొదలైనవారు ఉన్నారు. ధోని గ్యారేజిలో లెక్కకు మించిన కార్లు, బైకులు ఉన్నాయి. వీటిలో ఖరీదైన కారు ఫెరారీ 599 జీటీఓ అని తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఫ్రీ వైఫై వినియోగం.. ప్రభుత్వం హెచ్చరిక