Sakshi News home page

మరోసారి ఇన్ఫోసిస్‌ దాతృత్వం.. రూ.33 కోట్లు విరాళం

Published Wed, Apr 10 2024 9:13 PM

Infosys Foundation Grants Rs 33 Cr To Karnataka Police - Sakshi

బెంగళూరు: ప్రముఖ టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. కర్ణాటక పోలీసుల సైబర్ క్రైమ్ దర్యాప్తు సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు రూ.33 కోట్లు మంజూరు చేసింది.

బెంగళూరు సీఐడీ ప్రధాన కార్యాలయంలో సెంటర్ ఫర్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (CCITR) సహకారాన్ని పునరుద్ధరించడానికి విప్రో ఫౌండేషన్ కర్ణాటకలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. 

సీసీఐటీఆర్‌తో అనుబంధాన్ని మరో 4 ఏళ్లు కొనసాగించడం ద్వారా కర్ణాటక పోలీసుల సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ 33 కోట్లు మంజూరు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.  

డిజిటల్ ఫోరెన్సిక్స్,సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో శిక్షణ, పరిశోధన ద్వారా రాష్ట్ర పోలీసు దళం సైబర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ సామర్థ్యాలను బలోపేతమవుతుందని ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ వెల్లడించింది. 

Advertisement

What’s your opinion

Advertisement