ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ వేతనంలో భారీ కోత: కారణాలివే!

Infosys CEO Salil Parekh=  total salary cut by 21 per cent in FY23 - Sakshi

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. ముఖ్యంగా   కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్ కూడా 2022-23 ఆర్థిక సంవత్సరానికి  సంబంధించి వేతనంలో  కోత విధించినట్టు తెలుస్తోంది.గత ఏడాది అందుకున్న రూ.71 కోట్లతో పోలిస్తే కేవలం రూ.56.44 కోట్లు మాత్రమే అందుకున్నారట.

ఇదీ చదవండి: షాకింగ్‌: 100కు పైగా డేంజరస్‌ యాప్స్‌,  వెంటనే డిలీట్‌ చేయకపోతే 

బిజినెస్ టుడే నివేదిక ప్రకారం, ఇన్ఫోస్ సీఈఓ సలీల్ పరేఖ్ గతేడాది తన వార్షిక వేతనంలో 21 శాతం తగ్గింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో  వేతనంగా  రూ. 56.44 కోట్లుగా ఉంది.  2021-22 ఆర్థిక సంవత్సరంలో, పరేఖ్ మొత్తం రూ.71 కోట్ల జీతం పొందారు. ఇదే విషయాన్ని కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడించింది.

(బుగట్టి రెసిడెన్షియల్‌ టవర్‌...నెక్ట్స్‌ లెవల్‌: దిమ్మదిరిగే ఫోటోలు)

పరేఖ్ మొత్తం వేతనంలో రూ. 6.67 కోట్ల మూల వేతనం, రూ. 18.73 కోట్ల పనితీరు ఆధారిత బోనస్, 9.71 కోట్ల స్టాక్ అవార్డులు మరియు 45 లక్షల ఇతర ప్రయోజనాలు ఉన్నాయి.స్టాక్‌ యూనిట్స్‌ ఆధారంగా వచ్చే రాబడి క్షీణత, ఇన్ఫోసిస్ బోనస్ ప్లాన్‌లో మార్పు వంటి కారణాల రీత్యా వేతనం భారీగా తగ్గినట్టు తెలుస్తోంది. 

 కాగా మార్చి 2023తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ తన ఉద్యోగుల సగటు వేరియబుల్ వేతనాన్ని 40 శాతం కోత విధించిన సంగతి తెలిసిందే. 2022-23లో సగటు ఇన్ఫోసిస్ ఉద్యోగి మొత్తం జీతం రూ. 10.3 లక్షలు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top