సేవల రంగానికి డిమాండ్‌ దన్ను  | Indian services sector growth broadly steadied in May 2025 | Sakshi
Sakshi News home page

సేవల రంగానికి డిమాండ్‌ దన్ను 

Jun 5 2025 4:35 AM | Updated on Jun 5 2025 9:42 AM

Indian services sector growth broadly steadied in May 2025

‘మే’ లో 58.8 పాయింట్లకు పీఎంఐ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌

న్యూఢిల్లీ: డిమాండ్‌ మెరుగుపడటంతో దేశీయంగా సేవల రంగం మే నెలలో స్వల్పంగా పెరిగింది. సర్వీసెస్‌ సెక్టార్‌ పనితీరును ప్రతిబింబించే హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ ఏప్రిల్‌లో 58.7 పాయింట్లుగా ఉండగా మే నెలలో 58.8 పాయింట్లుగా నమోదైంది. పీఎంఐ 50కి ఎగువన ఉంటే వృద్ధిని, 50కి దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది. 

అంతర్జాతీయంగా పటిష్టమైన డిమాండ్‌ నెలకొనడాన్ని సూచిస్తూ ఏప్రిల్‌ నుంచి కొత్తగా ఎగుమతులు పుంజుకోవడమనేది మే నెలలో సేవల రంగానికి సానుకూలాంశంగా నిల్చిందని హెచ్‌ఎస్‌బీసీ చీఫ్‌ ఇండియా ఎకానమిస్ట్‌ ప్రాంజల్‌ భండారీ తెలిపారు. ఇండెక్స్‌కి సంబంధించిన సర్వే ప్రకారం ప్రకటనలు, డిమాండ్, ప్రస్తుత క్లయింట్ల నుంచి మళ్లీ ఆర్డర్లు రావడం వంటివి అంశాలు సర్వీసెస్‌ సెక్టార్‌ మెరుగ్గా రాణించేందుకు తోడ్పడ్డాయని  భండారీ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement