భారత ఆటబొమ్మల నాణ్యత భేష్‌ | India toy industry rapid growth driven by government policies | Sakshi
Sakshi News home page

భారత ఆటబొమ్మల నాణ్యత భేష్‌

Jun 18 2025 2:59 PM | Updated on Jun 18 2025 3:17 PM

India toy industry rapid growth driven by government policies

బీఐఎస్‌ సైంటిస్ట్‌ డైరెక్టర్‌ అద్భుత్‌ సింగ్‌

భారత ఆటబొమ్మల (టాయ్స్‌) నాణ్యత ప్రమాణాలు అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌ కంటే మెరుగైనవని భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్‌) సైంటిస్ట్‌ డైరెక్టర్‌ (వెస్టర్న్‌ రీజినల్‌ ఆఫీస్‌ ల్యాబరేటరీ) అద్భుత్‌ సింగ్‌ తెలిపారు. దేశీ ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయడంలో ఈ ప్రమాణాలు సాయపడుతున్నట్టు చెప్పారు.

టాయ్స్‌కు సంబంధించి భౌతిక, రసాయన, ఎలక్ట్రికల్‌ భద్రతా ప్రమాణాలను బీఐఎస్‌ రూపొందించి, అమలు చేస్తుండడం గమనార్హం. అంతర్జాతీయంగా ఐఎస్‌వో, ఐఈసీ సంస్థలు నిర్ణయించిన బెంచ్‌మార్క్‌ ప్రమాణాలకు అనుగుణంగా భారతీయ ప్రమాణాలను బీఐఎస్‌ అభివృద్ది చేసింది. వీటి ప్రకారం దేశీయంగా తయారీకి, దిగుమతులకు గాను ఏడు రకాల ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. ఈ ప్రమాణాలు దేశీయంగా, అంతర్జాతీయంగా భారత ఆటబొమ్మల అమ్మకాలు పెరిగేందుకు సాయపడినట్టు అద్భుత్‌ సింగ్‌ తెలిపారు.  

పోటీకి అవకాశం..

బీఐఎస్‌ ప్రమాణాలు ఆవిష్కరణలను ప్రోత్సహించడంతోపాటు దిగ్గజ కంపెనీలతో పోటీపడే అవకాశం కల్పించినట్లు ముంబైకి చెందిన జెఫిర్‌ టాయ్‌మేకర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సీఈవో మోయిజ్‌ గబ్జీవాలా తెలిపారు. ‘బీఐఎస్‌ ప్రమాణాలు అమల్లోకి వచ్చిన తర్వాత (2021 జనవరి 1 నుంచి) మా ఆదాయం గణనీయంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.25 కోట్ల ఆదాయం సాధించాం. 2025–26లో 20 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం’ అని ప్రకటించారు. 

ఇదీ చదవండి: ఓలా డ్రైవర్లకు జీరో కమీషన్‌

తమ ఉత్పత్తుల్లోకి వినియోగించే ముడి సరుకుల్లో 99 శాతం దేశీయంగా తయారైనవేనని చెప్పారు. 15 కేటగిరీల్లో 100కు పైగా రకాలతో 1–1.5 లక్షల బొమ్మలను నెలవారీగా ఉత్పత్తి చేస్తున్నట్టు చెప్పారు. భారత కంపెనీలు ఇప్పుడు నాణ్యమైన ఆటబొమ్మలను అందుబాటు ధరలకే ఉత్పత్తి చేయగలుగుతున్నట్టు వివరించారు. బీఐఎస్‌ సర్టిఫికేషన్‌ ఉంటే సంబంధిత ఆటబొమ్మల్లో పాదరసం, థాలేట్స్‌ వంటి విషపూరిత పదార్థాలు లేవని, మింగేందుకు అవకాశం ఉన్న చిన్నపాటి విడిభాగాల్లేవని, పదునైన అంచుల్లేవన్న భరోసానిస్తుందని అద్భుత్‌ సింగ్‌ తెలిపారు. గ్లోబ్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనీషియేటివ్‌ సంస్థ (జీటీఆర్‌ఐ) నివేదిక ప్రకారం చూస్తే.. 2023–24లో టాయ్స్‌ ఎగుమతులు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 154 మిలియన్‌ డాలర్ల నుంచి 152 మిలియన్‌ డాలర్లకు తగ్గడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement