
మేకిన్ ఇండియా నినాదంలో భాగంగా దేశీయంగా భారీ నౌకల తయారీని మరింతగా ప్రోత్సహించే దిశగా ఈ పరిశ్రమకు మౌలిక రంగ హోదాను కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇన్‌ఫ్రాలో భాగమైన రంగాల మాస్టర్ లిస్ట్‌లో రవాణా, లాజిస్టిక్స్ కేటగిరీలో దీన్ని కూడా చేర్చింది. ఈ మేరకు సెప్టెంబర్ 19న ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం 10,000 పైగా టన్నుల స్థూల టన్నేజ్ ఉండి, భారతీయ ఓనర్‌షిప్, జెండా గల వాణిజ్య నౌకలకు ఇన్‌ఫ్రా హోదా లభిస్తుంది. అలాగే దేశీయంగా తయారై, భారతీయ ఓనర్‌షిప్, ఫ్లాగ్‌తో 1,500 పైగా స్థూల టన్నేజీ గల వాణిజ్య నౌకలు కూడా ఈ కేటగిరీ కింద వస్తాయి. ఇన్‌ఫ్రా హోదా గల పరిశ్రమల్లోని సంస్థలకు .. రుణాల సమీకరణకు సంబంధించి వెసులు బాట్లు లభిస్తాయి. పన్నులపరమైన రాయితీలు మొదలైన ప్రయోజనాలు కూడా ఉంటాయి.
ఇదీ చదవండి: భారత్‌కు యూఏఈ వీసా నిలిపేసిందా?