తగ్గిన విదేశీ మారక నిల్వలు | India forex reserves fell | Sakshi
Sakshi News home page

తగ్గిన విదేశీ మారక నిల్వలు

Nov 10 2024 9:01 AM | Updated on Nov 10 2024 11:15 AM

India forex reserves fell

ముంబై: భారత విదేశీ మారక (ఫారెక్స్‌) నిల్వలు నవంబర్‌ ఒకటి నాటికి 682.13 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. అంత క్రితం వారంతో పోలిస్తే నిల్వలు 2.67 బిలియన్‌ డాలర్లు క్షీణించాయి. సెప్టెంబర్‌ చివరినాటికి  ఫారెక్స్‌ నిల్వలు భారత్‌లో గరిష్ట స్థాయిని తాకి 704.885 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.

బంగారం నిల్వలు 1.224 బిలియన్‌ డాలర్లు ఎగసి 69.751 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌ఈఆర్‌) ఒక మిలియన్‌ డాలర్లు తగ్గి 18.219 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఐఎంఎఫ్‌ వద్ద భారత నిల్వలు నాలుగు మిలియన్‌ డాలర్లు అధికమై 4.311 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి.

Advertisement
 
Advertisement
Advertisement