హైదరాబాద్: నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ ఐసీఎల్ ఫిన్‌కార్ప్ తాజాగా నాన్–కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్‌సీడీ) ద్వారా నిధులను సమీకరించనుంది. ఇందుకు సంబంధించిన ఇష్యూ నవంబర్ 17న ప్రారంభమవుతుందని సంస్థ సీఎండీ కె.జి. అనిల్ కుమార్ తెలిపారు.
13 నుంచి 70 నెలల వరకు కాలవ్యవధికి జారీ చేసే ఈ ఎన్‌సీడీలపై ఈల్డ్ (రాబడి) 10.50 శాతం నుంచి 12.62 శాతం వరకు ఉంటుందని చెప్పారు. ఒక్కో ఎన్‌సీడీ ముఖ విలువ రూ. 1,000గా ఉండగా, కనీస దరఖాస్తు మొత్తం రూ. 10,000గా ఉంటుంది. ఈ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను వ్యాపార విస్తరణకు కంపెనీ వినియోగించుకోనుంది.


