ఇక ఏడాదికి ఇన్నే ఆడిట్లు.. సీఏలకు కొత్త రూల్‌ | ICAI to cap individual CA annual audits to 60 | Sakshi
Sakshi News home page

ఇక ఏడాదికి ఇన్నే ఆడిట్లు.. సీఏలకు కొత్త రూల్‌

Jun 29 2025 10:33 AM | Updated on Jun 29 2025 12:33 PM

ICAI to cap individual CA annual audits to 60

వ్యక్తిగతంగా గానీ లేదా ఏదైనా సంస్థలో భాగస్వామిగా గానీ చార్టర్డ్‌ అకౌంటెంట్లు సంవత్సరానికి ట్యాక్స్‌ ఆడిట్లు 60 మాత్రమే చేసేలా చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఐసీఏఐ నిర్ణయం తీసుకుంది. ఈ పరిమితి 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇప్పుడు కూడా ఈ నిబంధన ఉన్నప్పటికీ, పార్ట్‌నర్స్‌ కోసం కూడా ఆడిట్‌ నిర్వహించేందుకు వెసులుబాటు ఉంది.

తాజాగా ప్రతిపాదించిన పరిమితిలో ఎలాంటి మినహాయింపులు ఉండవని ఐసీఏఐ ప్రెసిడెంట్‌ చరణ్‌జోత్‌ సింగ్‌ నందా తెలిపారు. అవకతవకలు జరగకుండా చూసేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం యూనిక్‌ డాక్యుమెంట్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ (యూడీఐఎన్‌) సిస్టంను ప్రవేశపెట్టినట్లు వివరించారు.

యూడీఐఎన్ అనేది ప్రాక్టీస్ చార్టర్డ్ అకౌంటెంట్ చేత సర్టిఫై చేసిన లేదా ధృవీకరించిన ప్రతి డాక్యుమెంట్ కోసం జనరేట్ చేసే ఒక ప్రత్యేక సంఖ్య. దేశీయ చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థలకు విదేశీ నెట్‌వర్కింగ్ మార్గదర్శకాల ముసాయిదాపై అభిప్రాయాలను సమర్పించడానికి గడువును జూలై 16 వరకు పొడిగించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement