హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 19 శాతం అప్‌ | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 19 శాతం అప్‌

Published Sat, Dec 2 2023 6:32 AM

Hyderabad Housing 19percent expensive in 2023 - Sakshi

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ మార్కెట్లో ఇళ్లకు డిమాండ్‌ బలంగా కొనసాగుతోంది. ఇది ధరలకు మద్దతుగా నిలుస్తోంది. సెపె్టంబర్‌ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 19 శాతం పెరిగినట్టు క్రెడాయ్, కొలియర్స్, లైసెస్‌ ఫొరాస్‌ సంయుక్త నివేదిక వెల్లడించింది. సగటున చదరపు అడుగు ధర రూ.11,040కు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో సెపె్టంబర్‌ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 10 శాతం మేర పెరిగాయి.

నివేదికలోని అంశాలు
► దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో ఇళ్ల ధరల పెరుగుదల అత్యధికంగా (19 శాతం) హైదరాబాద్‌లోనే నమోదైంది. ఆ తర్వాత బెంగళూరులో ధరల పెరుగుదల 18 శాతంగా ఉంది.
►అహ్మదాబాద్‌లో చదరపు అడుగు ధర 9 శాతం పెరిగి రూ.6,613గా ఉంది.  
►బెంగళూరులో క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చిచూస్తే ఇళ్ల ధర చదరపు అడుగునకు 18 శాతం పెరిగి రూ.9,471గా ఉంది. 
►చెన్నైలో 7 శాతం వృద్ధితో చదరపు అడుగు ధర రూ.7,712కు చేరుకుంది. 
►ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో ఇళ్ల ధర 12 శాతం పెరిగి చదరపు అడుగు రూ.8,655గా ఉంది.
►కోల్‌కతా మార్కెట్లో 12 శాతం పెరిగి రూ.7,406కు చేరగా, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో చదరపు అడుగు ధర ఒక శాతం వృద్ధితో రూ.19,585కు చేరింది.
►పుణెలో 12 శాతం పెరిగి రూ.9,014గా ఉంది.


సానుకూల సెంటిమెంట్‌
‘‘2023లో ఇళ్ల కొనుగోలుదారుల్లో సెంటిమెంట్‌ సానుకూలంగా ఉంది. హౌసింగ్‌ రిజి్రస్టేషన్లు పెరగడంతో, అది పరోక్షంగా ఇళ్ల ధరలు పెరిగేందుకు దారితీసింది’’అని క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ బొమన్‌ ఇరానీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల ధరలు 10 శాతం పెరగడం పోటీతో కూడిన అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ను ప్రతిఫలిస్తోందని కొలియర్స్‌ ఇండియా సీఈవో బాదల్‌ యాగ్నిక్‌ పేర్కొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement