హైబ్రిడ్‌ ఫండ్స్‌కు భారీ డిమాండ్‌ | Sakshi
Sakshi News home page

హైబ్రిడ్‌ ఫండ్స్‌కు భారీ డిమాండ్‌

Published Thu, Feb 22 2024 4:59 AM

Hybrid mutual funds gather steam, attract rs 20634 crore - Sakshi

న్యూఢిల్లీ: హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలకు గత నెలలో భారీ డిమాండ్‌ నెలకొంది. దీంతో 2024 జనవరిలో పెట్టుబడులు 37 శాతం జంప్‌ చేశాయి. రూ. 20,634 కోట్లను తాకాయి. డెట్‌ ఫండ్స్‌పై పన్ను చట్టాలలో మార్పులరీత్యా ప్రత్యామ్నాయ పెట్టుబడి అవకాశంగా నిలుస్తుండటంతో ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. వెరసి ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2023–24) తొలి 10 నెలల్లో(ఏప్రిల్‌–జనవరి) హైబ్రిడ్‌ ఫండ్స్‌లో మొత్తం పెట్టుబడులు రూ. 1.21 లక్షల కోట్లకు చేరాయి. అయితే గతేడాది(2022–23) హైబ్రిడ్‌ పథకాల నుంచి నికరంగా పెట్టుబడులు వెనక్కి మళ్లిన సంగతి తెలిసిందే.  

హైబ్రిడ్‌ ఫండ్స్‌ అంటే
హైబ్రిడ్‌ ఫండ్స్‌కు చెందిన మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు సాధారణంగా ఈక్విటీ, రుణ సెక్యూరిటీలు రెండింటిలోనూ ఇన్వెస్ట్‌ చేస్తాయి. కొన్ని సందర్భాలలో బంగారం తదితర ఆస్తులలోనూ పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తుంటాయి. కాగా.. 2023 ఏప్రిల్‌ నుంచి హైబ్రిడ్‌ ఫండ్స్‌ పెట్టుబడిదారులను తమవైపు తిప్పుకున్నాయి. ఇందుకు ప్రధానంగా ఏప్రిల్‌ నుంచి డెట్‌ ఫండ్స్‌ పన్ను చట్టాలలో నెలకొన్న సవరణలు ప్రభావం చూపుతున్నాయి.

అంతక్రితం మార్చితో ముగిసిన ఏడాదిలో రూ. 12,372 కోట్ల పెట్టుబడులు తరలిపోవడం గమనార్హం! మ్యూచువల్‌ ఫండ్‌ అసోసియేషన్‌(యాంఫీ) తాజా గణాంకాల ప్రకారం జనవరిలో హైబ్రిడ్‌ పథకాలు రూ. 20,637 కోట్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. అంతకుముందు డిసెంబర్‌లో లభించిన రూ. 15,009 కోట్లతో పోలిస్తే భారీగా ఎగశాయి. ప్రధానంగా ఆర్బిట్రేజ్‌ ఫండ్స్, మల్టీ అసెట్‌ అలొకేషన్‌ ఫండ్స్‌కు అత్యధిక పెట్టుబడులు ప్రవహించాయి.

ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌కు రూ. 10,608 కోట్లు లభించగా.. మల్టీ అసెట్‌ అలొకేషన్‌ ఫండ్స్‌కు రూ. 7,080 కోట్ల పెట్టుబడులు తరలి వచ్చాయి. గత ఆరు నెలల్లోనూ ఇన్వెస్టర్లు తమ మొత్తం పెట్టుబడుల్లో ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌కు 50–70 శాతాన్ని కేటాయించారు. ఇందుకు పన్ను మార్గదర్శకాలలో మార్పులు కారణమవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌ స్ప్రెడ్‌ సుమారు 8 శాతానికి చేరడం పెట్టుబడి అవకాశాలకు దారి చూపుతున్నట్లు ఆనంద్‌ రాఠీ వెల్త్‌ డిప్యూటీ సీఈవో ఫిరోజ్‌ అజీజ్‌ వెల్లడించారు.

ఫోలియోలు ప్లస్‌
జనవరిలో హైబ్రిడ్‌ ఫోలియోలు 3.36 లక్షలు కొత్త గా జత కలిశాయి. దీంతో మొత్తం హైబ్రిడ్‌ ఫోలియోల సంఖ్య 1.31 కోట్లకు చేరింది. వెరసి మొత్తం 16.95 కోట్ల ఫోలియోలలో వీటి వాటా 7.7 శాతా న్ని తాకింది. తక్కువ రిస్క్‌ భరించే ఇన్వెస్టర్లకు హై బ్రిడ్‌ ఫండ్స్‌ ఉపయుక్తంగా ఉంటాయి. ఈక్విటీ మా ర్కెట్లలో పెట్టుబడులు ఆటుపోట్లకు లోనయ్యే సంగతి తెలిసిందే. అయితే ఫిక్స్‌డ్‌ ఆదాయంలో లభించే స్థిరత్వాన్ని ఇవి కల్పిస్తుండటంతో పెట్టుబడు లను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఫిక్స్‌డ్‌ ఆదా యం మార్గాలలో ఇన్వెస్ట్‌ చేయదలచినవారు హైబ్రి డ్‌ ఫండ్స్‌వైపు చూస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement