హమ్మయ్యా.. నగరాల్లో ట్రాఫిక్‌ కష్టాలు తీరిపోనున్నాయ్‌!

How This Flying Racecar, Airspeeder Mk4 - Sakshi

నగరాల్లో ట్రాఫిక్‌ ఇక్కట్లను దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియన్‌ కంపెనీ ‘ఆల్డా ఏరోనాటిక్స్‌’ ఇటీవల ఏకంగా పర్సనల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను రూపొందించింది. ఇందులో ఒక్కరు మాత్రమే ప్రయాణించేందుకు వీలవుతుంది. ‘ఎయిర్‌ స్పీడర్‌ ఎంకే4’ పేరిట తయారు చేసిన ఈ పర్సనల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ బ్యాటరీతో పనిచేసే ‘ఈవీటీఓల్‌’ ఎలక్ట్రిక్‌ మోటార్స్‌తో నడుస్తుంది.

బ్యాటరీ సహాయంతో పనిచేసే ఈ ఎలక్ట్రిక్‌ మోటార్స్‌ ద్వారా ఇందులోని వెయ్యి కిలోవాట్ల థండర్‌స్ట్రైక్‌ హైడ్రోజన్‌ టర్బో జనరేటర్‌కు విద్యుత్‌ సరఫరా అవుతుంది. టేకాఫ్, ల్యాండింగ్‌ చాలా సునాయాసంగా జరిగేలా దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. టేకాఫ్‌ తర్వాత ఇది గరిష్ఠంగా గంటకు 362 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

ఇందులోని బ్యాటరీని పూర్తిగా చార్జ్‌ చేసినట్లయితే, ఇది నిరాటంకంగా 180 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. వివిధ దేశాల్లో ఇది త్వరలోనే మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top