హీరో గ్లామర్.. ఇప్పుడు కొత్త హంగులతో.. | Hero Glamour X 125 Launched With Integrated ABS | Sakshi
Sakshi News home page

హీరో గ్లామర్.. ఇప్పుడు కొత్త హంగులతో..

Sep 12 2026 5:18 PM | Updated on Sep 12 2026 5:43 PM

Hero Glamour X 125 Launched With Integrated ABS

హీరో మోటోకార్ప్.. దేశీయ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు పొందుతున్న గ్లామర్ బైకుకు కొత్త అప్డేట్స్ తీసుకొచ్చింది. కంపెనీ ఇప్పుడు ఇందులో సింగిల్ ఛానల్ ఏబీఎస్, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ (ఐబీఎస్) లను కలిపి రూపొందించిన కొత్త బ్రేకింగ్ సిస్టమ్‌ అందిస్తుంది. దీని ధర రూ. 1.01 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

125 సీసీ సెగ్మెంట్‌లో సింగిల్-ఛానల్ ఏబీఎస్, ఐబీఎస్ వంటివాటితో వస్తున్న మొట్టమొదటి మోటార్‌సైకిల్ గ్లామర్ ఎక్స్ 125 అని హీరో పేర్కొంది. ఈ కొత్త బ్రేకింగ్ హార్డ్‌వేర్ గట్టిగా బ్రేక్ వేసినప్పుడు ముందు చక్రాలు లాక్ అవ్వకుండా నివారిస్తుంది, అదే సమయంలో ఐబీఎస్ ముందు, వెనుక బ్రేకులను అనుసంధానించడం ద్వారా బ్రేకింగ్ పనితీరును మెరుగుపరుస్తుంది. గ్లామర్ ఎక్స్ బైకులో పానిక్ బ్రేక్ అలర్ట్, హజార్డ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు కూడా కొనసాగుతున్నాయి.

హీరో గ్లామర్ ఎక్స్‌లో 124.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 8,250 rpm వద్ద 11.4bhp పవర్.. 6,500rpm వద్ద 10.5Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్‌సైకిల్‌లో ఎకో, రోడ్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అంతేకాకుండా.. ఇందులో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది.

హీరో గ్లామర్ ఎక్స్ 125లో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్‌లతో కూడిన కలర్ టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. ఇతర ఫీచర్లలో ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్, సీటు కింద మొబైల్ స్టోరేజ్ వంటివి ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ ABSతో కూడిన గ్లామర్ ఎక్స్ గన్ మెటల్ గ్రే, మ్యాట్ యాక్సిస్ గ్రే, బ్లాక్ పెర్ల్ రెడ్, బ్లాక్ టీల్ బ్లూ అనే నాలుగు రంగులలో లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement