బైక్ కొనుగోలుపై రూ.5.30 లక్షలు డిస్కౌంట్.. వివరాలు | Harley Davidson Rs 5 30 lakh discount | Sakshi
Sakshi News home page

బైక్ కొనుగోలుపై రూ.5.30 లక్షలు డిస్కౌంట్.. వివరాలు

Oct 26 2023 9:32 PM | Updated on Oct 26 2023 9:39 PM

Harley Davidson Rs 5 30 lakh discount - Sakshi

పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు అద్భుతమైన ఆఫర్స్ అందిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'హార్లే డేవిడ్‌సన్' చేరింది.

హార్లే డేవిడ్‌సన్ ప్రస్తుతం ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ మీద భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. పాన్ అమెరికా 1250 స్పెషల్ అడ్వెంచర్ టూరర్‌ మీద సంస్థ రూ. 3.25 లక్షలు తగ్గింపును అందిస్తోంది. దీంతో ఈ బైక్ ధర రూ. 21.24 లక్షలకు చేరింది. స్పోర్ట్‌స్టర్ ఎస్ కొనుగోలు మీద కూడా ఇదే డిస్కౌంట్ అందిస్తోంది. ఈ బైక్ కొనాలనుకునే వారు రూ. 15.54 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది.

నైట్‌స్టర్ మీద ప్రస్తుతం రూ. 5.25 లక్షల తగ్గింపు అందుబాటులో ఉంది. దీనిని ఇప్పుడు రూ. 12.24 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. నైట్‌స్టర్ స్పెషల్ బైక్ మీద కంపెనీ ఏకంగా రూ.5.30 లక్షల డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బైక్ కొనుగోలు చేయాలనుకునే వారు రూ. 12.99 లక్షలకు సొంతం చేసుకోవచ్చు.

హార్లే డేవిడ్‌సన్ 2022 మోడల్స్ మీద కూడా డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో 2022 నైట్‌స్టర్ మీద రూ. 4.30 లక్షలు, స్పోర్ట్‌స్టర్ ఎస్ మీద రూ. 4.45 లక్షలు, పాన్ అమెరికా స్పెషల్ మీద రూ. 4.90 లక్షల తగ్గింపు లభిస్తుంది. 

Note: కంపెనీ అందించే డిస్కౌంట్స్ స్టాక్ ఉన్నత వరకు మాత్రమే కాకుండా, ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉంటాయి. కస్టమర్లు ఖచ్చితమైన డిస్కౌంట్స్ తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement