బంగారం నేడు ఎంత పలుకుతోందంటే.. | Gold and Silver Price Today 26 July 2024 | Sakshi
Sakshi News home page

బంగారం నేడు ఎంత పలుకుతోందంటే..

Jul 26 2024 12:53 PM | Updated on Jul 26 2024 3:08 PM

Gold and Silver Price Today 26 July 2024

బడ్జెట్ ప్రకటన తర్వాత మొదలైన బంగారం ధరల భారీ పతనానికి బ్రేకులు పడ్డాయి. వరుసగా మూడురోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు (జూలై 26) నిలకడగా ఉన్నాయి. చెన్నైలో మాత్రం మళ్లీ స్వల్పంగా తగ్గాయి.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు
హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని  వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) రూ.64,000 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం రూ. 69,820 వద్ద నిలిచింది. బెంగళూరు, ముంబైలలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

ఇతర నగరాల్లో.. 
ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.64,150 వద్ద, 24 క్యారెట్ల బంగారం  రూ.69,950 వద్ద కొనసాగుతున్నాయి. అయితే చెన్నైలో మాత్రం వరుసగా ఐదో రోజు కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం రూ.150 తగ్గి రూ.64,150 లకు క్షీణించింది. 24 క్యారెట్ల బంగారం రూ.170 తగ్గి రూ.69,980 వద్దకు వచ్చింది.

నిలకడగా వెండి
దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా ఈరోజు స్థిరంగా ఉన్నాయి. మూడు రోజులుగా క్షీణిస్తున్న వెండి రేటు నిలకడా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.89,000 వద్ద ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement