‘AI’తో ప్రమాదమే.. గాడ్‌ ఫాదర్‌ ఆఫ్‌ ఏఐ వార్నింగ్‌ | Godfather Of AI Warns About Massive Job Losses | Sakshi
Sakshi News home page

‘AI’తో ప్రమాదమే.. గాడ్‌ ఫాదర్‌ ఆఫ్‌ ఏఐ వార్నింగ్‌

May 20 2024 12:13 PM | Updated on May 20 2024 12:16 PM

Godfather Of AI Warns About Massive Job Losses

ఆటోమేటిక్‌గా నడిచే కార్లు, బైక్‌లు.. ఇలా ఎక్కడ చూసినా కృత్రిమ మేధ మన జీవితంలో ఓ భాగంగా మారిపోతోంది. అయితే దీంతో చాలా పనులు సులభంగా పూర్తవుతున్నందుకు సంతోషంగానే ఉన్నా.. ఇది మన ఉద్యోగాలకు ఎక్కడ ఎసరు పెడుతుందోనన్న భయం నెలకొంది. తాజాగా, గాడ్‌ ఫాదర్‌ ఆఫ్‌ ఏఐ జెఫ్రీ హింటన్ సైతం ఇదే ఆందోళనను వెలిబుచ్చారు. 

ఓ ఇంటర్వ్యూలో అన్నీ రంగాల్లో పెరిగిపోతున్న ఏఐ వినియోగం గురించి చర్చించారు. రానున్న రోజుల్లో దాని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయో హెచ్చరించారు.  

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోవడంపై జెఫ్రీ హింటన్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఏఐ విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ప్రపంచానికి ఆదాయం అవసరమని, అలాంటి అవకాశాల్ని ప్రభుత్వాలే సృష్టించాలని తెలిపారు. ఇక లేఆఫ్స్‌ గురైన ఉద్యోగులకు ప్రభుత్వాలు బేసిక్‌ పే శాలరీ చెల్లిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement