మైక్రోసాఫ్ట్ సేవల్లో భారీ అంతరాయం.. యూజర్లకు తప్పని తిప్పలు! | Global Outage Hits Microsoft Outlook Other 365 Services Down | Sakshi
Sakshi News home page

మైక్రోసాఫ్ట్ సేవల్లో భారీ అంతరాయం.. యూజర్లకు తప్పని తిప్పలు!

Nov 13 2026 8:30 AM | Updated on Nov 13 2026 8:34 AM

Global Outage Hits Microsoft Outlook Other 365 Services Down

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా అవుట్‌లుక్‌, మైక్రోసాఫ్ట్ టీమ్స్, కోపైలెట్, మైక్రోసాఫ్ట్ 365 సేవలు సరిగ్గా పనిచేయకపోవడంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం కారణంగా.. చాలామంది తమ ఈమెయిల్ ఇన్‌బాక్స్‌లను ఓపెన్ చేయలేకపోగా, మరికొందరు మెయిల్స్ పంపడం, స్వీకరించడం సాధ్యం కావడం లేదని ఫిర్యాదు చేశారు. అవుట్‌లుక్ సమస్యలపై దాదాపు 1.30 లక్షల మంది ఫిర్యాదులు చేసినట్లు డౌన్‌డిటెక్టర్‌ వెల్లడించింది.

అవుట్‌లుక్‌ మాత్రమే కాకుండా.. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఇతర సేవలు కూడా ఈ సమస్య బారినపడ్డాయి. ముఖ్యంగా ఆఫీసు ఉద్యోగులు రోజువారీ పనుల కోసం ఉపయోగించే Microsoft Teamsలో  వేలాది మంది సమస్యలను ఎదుర్కొన్నారు. అలాగే.. మైక్రోసాఫ్ట్ ఏఐ అసిస్టెంట్ కోపైలెట్, మైక్రోసాఫ్ట్ 365 సేవల్లోనూ అంతరాయాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడి పనిచేసే ఉద్యోగులు, సంస్థల రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగింది.

మైక్రోసాఫ్ట్ స్పందన
ఈ సమస్యపై స్పందించిన మైక్రోసాఫ్ట్.. తమకు అంతరాయం గురించి సమాచారం ఉందని, సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. ముఖ్యంగా అమెరికాలోని యూజర్లు ఎక్స్చేంజ్ ఆన్‌లైన్ మెయిల్‌బాక్స్‌లను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. తమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోని కొన్ని భాగాలపై అధిక లోడ్ పడటం, ఆటోమేటెడ్ చెకింగ్ సమయంలో ఏర్పడిన సమస్య కారణంగా కొన్ని సర్వర్లు అనూహ్యంగా అందుబాటులో లేకుండా పోయాయని ప్రాథమికంగా గుర్తించింది.

ఇదీ చదవండి: ముగ్గురు స్నేహితుల సాహసం.. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

మరోవైపు.. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఫిక్స్‌ను పరీక్షిస్తున్నామని, యూజర్లకు ఎదురవుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని కంపెనీ వెల్లడించింది. ఉత్తర అమెరికాలో Microsoft Teamsకు సంబంధించిన సమస్యలను పరిష్కరించినట్లు ప్రకటించినప్పటికీ, కొంతమంది యూజర్లు ఇంకా కనెక్టివిటీ సమస్యలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement