పర్యాటకులను ఆకర్షించేలా అన్ని చర్యలు | India’s inbound tourism nears pre-COVID levels with 9.95 million foreign visitors in 2024 | Sakshi
Sakshi News home page

పర్యాటకులను ఆకర్షించేలా అన్ని చర్యలు

Nov 10 2025 1:03 PM | Updated on Nov 10 2025 1:15 PM

Foreign Tourist Arrivals in India Set to Leave Better Memories in 2025

భారతదేశం ఇన్‌బౌండ్‌ టూరిజం (దేశంలోకి వచ్చే పర్యాటకులు) సమీప భవిష్యత్తులో బలంగా పుంజుకుంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇటీవల విదేశీ పర్యాటకుల రాక కొవిడ్‌ పూర్వ స్థాయికి చేరుకుంటుండడం మాత్రమే కాకుండా ప్రయాణ అనుభవాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయి. క్రమబద్ధీకరించిన వీసా ప్రక్రియలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, సాంస్కృతిక పరిస్థితులు విదేశీ సందర్శకులను ఆకర్షిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

పెరిగిన పర్యాటకులు

భారతదేశం పర్యాటక రంగం 2024లో ఆశించిన వృద్ధిని సాధించింది. పర్యాటక మంత్రిత్వ శాఖ అందించిన గణాంకాల ప్రకారం 2024లో 9.95 మిలియన్ల విదేశీ పర్యాటకులు భారత్‌ వచ్చారు. ఇది 2023 కంటే 4.5% పెరుగుదలను సూచిస్తుంది. 2019 నాటి కొవిడ్ పూర్వ స్థాయి 10.9 మిలియన్ల మార్కుకు దగ్గరగా ఉంది. 2025లో ఈ మార్కు చేరుకుంటుందని పరిశ్రమ నిపుణులు విశ్వసిస్తున్నారు. చాలా మంది టూర్ ఆపరేటర్లు ప్రస్తుత పీక్ సీజన్‌లో 10-15% అధిక బుకింగ్‌లు వస్తున్నట్లు చెబుతున్నారు. విదేశీ పర్యాటకుల రాక కోసం భారత్‌ ఇటీవల కాలంలో తీసుకున్న చర్యలు కింది విధంగా ఉన్నాయి.

  • ఈ-వీసా (e-Visa) యాక్సెస్, వేగవంతమైన అనుమతులు 160 కంటే ఎక్కువ దేశాల నుంచి పర్యాటకుల ప్రయాణాన్ని సులభతరం చేశాయి.

  • కొత్త అంతర్జాతీయ విమాన మార్గాలను ప్రారంభించింది.

  • పర్యాటక ప్రదేశాలకు రోడ్డు, రైలు, వాయు మార్గాలను  అప్‌గ్రేడ్‌ చేసింది.

  • హోటల్ ఆక్యుపెన్సీ పెరిగేందుకు చర్యలు తీసుకుంది.

  • పర్యాటకుల డిమాండ్‌కు అనుగుణంగా టూర్ ఆపరేటర్లు మరింత పర్సనలైజ్‌ ప్రయాణాలను అందిస్తున్నారు.

ఇదీ చదవండి: కొత్త క్రెడిట్ కార్డుకు అప్లై చేస్తే సిబిల్‌ తగ్గుతుందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement