ఫోర్బ్స్‌ ఇండియా సంపన్నుల జాబితాలో జాయ్‌ అలుక్కాస్‌ | Forbes India 100 Richest 2023 List: Forbes Names Joy Alukkas As India Richest Jeweller, Reach 50th Spot - Sakshi
Sakshi News home page

ఫోర్బ్స్‌ ఇండియా సంపన్నుల జాబితాలో జాయ్‌ అలుక్కాస్‌

Oct 14 2023 4:27 AM | Updated on Oct 14 2023 10:23 AM

Forbes Names Joy Alukkas as India Richest Jeweller - Sakshi

కొచ్చి: ఫోర్బ్స్‌ 100 మంది సంపన్న భారతీయుల జాబితాలో జోయాలుక్కాస్‌ కంపెనీ చైర్మన్‌ జాయ్‌ అలుక్కాస్‌ 50వ స్థానం దక్కించుకున్నారు. తద్వారా భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక జ్యువెలర్‌గా ఖ్యాతి గడించారు. జ్యువెలరీ రంగంలో పెను మార్పులు తీసుకురావడంలో జాయ్‌ అలుక్కాస్‌ కీలక పాత్ర పోషించారు.

ఆర్థిక సంక్షోభం(2008), కరోనా మహమ్మారి(2020) వంటి అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులను విజయవంతంగా అధిగమించి వ్యాపారాన్ని నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్ద అవుట్‌లెట్‌ను చెన్నైలో ప్రారంభించడం, ప్రోత్సాహంగా రోల్స్‌ రాయిస్‌ కార్లను బహుమతిగా ఇవ్వడం, రష్యా తూర్పు భాగం ప్రాంతాల కొత్త మార్కెట్లలో ప్రవేశించడం వంటి విన్నూత ఆలోచనలతో జోయాలుక్కాస్‌ను ‘వరల్డ్స్‌ పేవరెట్‌ జ్యువెలర్‌’ గా జోయాలుక్కాస్‌ సంస్థగా తీర్చిద్దిద్దారు. 

Advertisement
 
Advertisement
Advertisement