breaking news
RICHEST INDIANS WEALTH
-
ఫోర్బ్స్ ఇండియా సంపన్నుల జాబితాలో జాయ్ అలుక్కాస్
కొచ్చి: ఫోర్బ్స్ 100 మంది సంపన్న భారతీయుల జాబితాలో జోయాలుక్కాస్ కంపెనీ చైర్మన్ జాయ్ అలుక్కాస్ 50వ స్థానం దక్కించుకున్నారు. తద్వారా భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక జ్యువెలర్‌గా ఖ్యాతి గడించారు. జ్యువెలరీ రంగంలో పెను మార్పులు తీసుకురావడంలో జాయ్ అలుక్కాస్ కీలక పాత్ర పోషించారు. ఆర్థిక సంక్షోభం(2008), కరోనా మహమ్మారి(2020) వంటి అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులను విజయవంతంగా అధిగమించి వ్యాపారాన్ని నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్ద అవుట్‌లెట్‌ను చెన్నైలో ప్రారంభించడం, ప్రోత్సాహంగా రోల్స్ రాయిస్ కార్లను బహుమతిగా ఇవ్వడం, రష్యా తూర్పు భాగం ప్రాంతాల కొత్త మార్కెట్లలో ప్రవేశించడం వంటి విన్నూత ఆలోచనలతో జోయాలుక్కాస్ను ‘వరల్డ్స్ పేవరెట్ జ్యువెలర్’ గా జోయాలుక్కాస్ సంస్థగా తీర్చిద్దిద్దారు. -
సగానికి పైగా దేశ సంపద వారిచేతుల్లోనే!
సంపన్నులైనా 1 శాతం మంది భారతీయుల దగ్గరే దేశంలోని సగానికి పైగా సంపద అంటే 58.4 శాతం ఉన్నట్టు క్రెడిట్ స్యూజ్ గ్రూప్ ఏజీ వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన తన తాజా ప్రపంచ సంపద డేటాలో ఈ విషయం తెలిపింది. గతేడాది వారి చేతుల్లో 53 శాతం ఉంటే, ఈ ఏడాది మరింత పెరిగిందని క్రెడిట్ స్యూజ్ పేర్కొంది. 2010 నుంచి ప్రతేడాది క్రెడిట్ స్యూజ్ ఈ డేటాను విడుదలచేస్తోంది. సంపన్నులే శరవేగంగా మరింత సంపన్నులుగా మారుతున్నారని ఈ డేటా వెల్లడించింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, వారి సంపదను మెరుగుపరుచుకోవడానికి వారు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని డేటా పేర్కొంది. 2000లో మాత్రమే దేశ సంపదలో వీరి సహకారం తగ్గి 36.8 శాతంగా నమోదైనట్టు క్రెడిట్ స్యూజ్ తెలిపింది. గత 16 ఏళ్లుగా ఈ 1 శాతం మంది సంపన్నులు దేశ సంపదలో గణనీయంగా వారి షేరును పెంచుకుంటున్నారని, మొత్తం సంపదలో మూడువంతుల మంది వారిదగ్గరే ఉన్నట్టు క్రెడిట్ స్యూజ్ డేటా వివరించింది. క్రెడిట్ స్యూజ్ విడుదలచేసిన ఈ గణాంకాలతో భారత్ అత్యంత అసమాన వ్యవస్థలో ఒకటిగా నిలుస్తున్నట్టు వెల్లడవుతోంది. ఈ గణాంకాల్లో టాప్ స్థానంలో రష్యా నిలిచింది. వారి దేశ సంపదలో 74.5 శాతం సంపద టాప్ 1 శాతం మంది చేతులోనే ఉంది. భారత్ తర్వాతి స్థానాలో చైనా(43.8 శాతం మంది), ఇండోనేషియా (49.3 శాతం మంది), బ్రెజిల్ (47.9 శాతం మంది)లు నిలిచాయి.