సగానికి పైగా దేశ సంపద వారిచేతుల్లోనే! | The richest 1% of Indians now own 58.4% of wealth | Sakshi
Sakshi News home page

సగానికి పైగా దేశ సంపద వారిచేతుల్లోనే!

Nov 23 2016 5:47 PM | Updated on Sep 4 2017 8:55 PM

సగానికి పైగా దేశ సంపద వారిచేతుల్లోనే!

సగానికి పైగా దేశ సంపద వారిచేతుల్లోనే!

సంపన్నులైనా 1 శాతం మంది భారతీయుల దగ్గరే దేశంలోని సగానికి పైగా సంపద అంటే 58.4 శాతం ఉన్నట్టు క్రెడిట్ స్యూజ్ గ్రూప్ ఏజీ వెల్లడించింది.

సంపన్నులైనా 1 శాతం మంది భారతీయుల దగ్గరే దేశంలోని సగానికి పైగా సంపద అంటే 58.4 శాతం ఉన్నట్టు క్రెడిట్ స్యూజ్ గ్రూప్ ఏజీ వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన తన తాజా ప్రపంచ సంపద డేటాలో ఈ విషయం తెలిపింది. గతేడాది వారి చేతుల్లో 53 శాతం ఉంటే, ఈ ఏడాది మరింత పెరిగిందని క్రెడిట్ స్యూజ్ పేర్కొంది. 2010 నుంచి ప్రతేడాది క్రెడిట్ స్యూజ్ ఈ డేటాను విడుదలచేస్తోంది.  సంపన్నులే శరవేగంగా మరింత సంపన్నులుగా మారుతున్నారని ఈ డేటా వెల్లడించింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, వారి సంపదను మెరుగుపరుచుకోవడానికి వారు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని డేటా పేర్కొంది.
 
2000లో మాత్రమే దేశ సంపదలో వీరి సహకారం తగ్గి  36.8 శాతంగా నమోదైనట్టు క్రెడిట్ స్యూజ్ తెలిపింది. గత 16 ఏళ్లుగా ఈ 1 శాతం మంది సంపన్నులు దేశ సంపదలో గణనీయంగా వారి షేరును పెంచుకుంటున్నారని, మొత్తం సంపదలో మూడువంతుల మంది వారిదగ్గరే ఉన్నట్టు క్రెడిట్  స్యూజ్ డేటా వివరించింది. క్రెడిట్ స్యూజ్ విడుదలచేసిన ఈ గణాంకాలతో భారత్ అత్యంత అసమాన వ్యవస్థలో ఒకటిగా నిలుస్తున్నట్టు వెల్లడవుతోంది. ఈ గణాంకాల్లో టాప్ స్థానంలో రష్యా నిలిచింది. వారి దేశ సంపదలో 74.5 శాతం సంపద టాప్ 1 శాతం మంది చేతులోనే ఉంది. భారత్ తర్వాతి స్థానాలో చైనా(43.8 శాతం మంది), ఇండోనేషియా (49.3 శాతం మంది), బ్రెజిల్ (47.9 శాతం మంది)లు నిలిచాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement