స్పైస్‌జెట్‌కు డెడ్‌లైన్‌: కడతారా? జైలుకెడతారా అజయ్‌ సింగ్‌కు సుప్రీం వార్నింగ్‌  | Sakshi
Sakshi News home page

స్పైస్‌జెట్‌కు డెడ్‌లైన్‌: కడతారా? జైలుకెడతారా అజయ్‌ సింగ్‌కు సుప్రీం వార్నింగ్‌ 

Published Mon, Sep 11 2023 3:38 PM

Credit Suisse case SC gives Ajay Singh last chance to pay else face jail - Sakshi

SpiceJet Vs Credit Suisse క్రెడిట్ సూయిస్ కేసులో  విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు భారీ షాక్‌  తగిలింది.క్రెడిట్ సూయిస్  బకాయిల చెల్లింపు విషయంలో   స్పైస్‌జెట్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్‌కు  దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.సుప్రీం ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం హెచ్చరించింది.  ఒప్పందం ప్రకారం మిలియన్‌ డాలర్ల బకాయిలను చెల్లింపులో స్పైస్‌జెట్‌ కావాలనే తాత్సారం చేస్తోందని, ఈ నేపథ్యంలో సింగ్ ,స్పైస్‌జెట్‌లపై ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతూ ఈ ఏడాది మార్చిలో క్రెడిట్ సూయిస్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.  దీన్ని విచారించిన  సుప్రీంకోర్టు తాజా ఆదేశాలిచ్చింది.  

సెప్టెంబర్ 15లోగా క్రెడిట్ సూయిస్‌కి వాయిదాల రూపంలో 5 లక్షల డాలర్లను  చెల్లించాలని, అలాగే డిఫాల్ట్ చేసిన మొత్తానికి 1 మిలియన్ డాలర్లు చెల్లించాలని స్పైస్‌జెట్ సుప్రీంకోర్టు ఆదేశించింది.లేని పక్షంలో 'కఠిన చర్యలు' తీసుకుంటామని స్పైస్‌జెట్‌ను సుప్రీంకోర్టు హెచ్చరించింది. బకాయిలు చెల్లించకపోతే అజయ్ సింగ్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సుప్రీం పేర్కొంది. (ఐఫోన్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌: అదిరిపోయే సరికొత్త ఫీచర్లు)

ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం క్రెడిట్ సూయిస్‌ బకాలయిలను క్రెడిట్ సూయిస్‌కి బకాయిలు చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని  చెల్లించని పక్షంలో సింగ్‌ను తీహార్ జైలుకు పంపుతామని కోర్టు పేర్కొంది. అంతేకాదు  ప్రతి విచారణలోనూ కోర్టుకు హాజరు కావాలని సింగ్‌ను ఆదేశించింది. ఇక చాలు..మీరు సంస్థను మూసివేసినా ..బాధలేదు. కానీ నిబంధనలకు  కట్టుబడి ఉండాల్సిందే ఇక  డిల్లీ-డాలీ బిజినెస్‌ను కట్టిపెట్టండి అంటూ కోర్టు  ఆగ్రహ్యం వక్తం చేసింది.  అనంతరం ఈ కేసును సెప్టెంబరు 22కి వాయిదా వేసింది. 

Advertisement
 
Advertisement