ఫుడ్‌ బిజినెస్‌ ప్రారంభించిన అలిబాబా జాక్‌మా | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ బిజినెస్‌ ప్రారంభించిన అలిబాబా జాక్‌మా

Published Sun, Nov 26 2023 8:48 PM

Food Business Starts From Alibaba Jackma - Sakshi

అలీబాబా గ్రూప్ అంటే వెంటనే గుర్తొచ్చేది జాక్‌మా, ఈకామర్స్‌ బిజినెస్‌. కానీ సంస్థ ఛైర్మన్‌గా వైదొలిగిన జాక్‌మా తాజాగా ఫుడ్‌ బిజినెస్‌ ప్రారంభించారని తెలిసింది. ప్రీ ప్యాకేజ్డ్ ఫుడ్‌ను విక్ర‌యించే కొత్త సంస్ధ‌ను జాక్ మా మొదలుపెట్టారని కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.

అలీబాబా ఛైర్మ‌న్‌గా జాక్ మా 2019లో త‌న పదవి నుంచి వైదొలిగారు. తాజాగా ఎఫ్‌ఎంసీజీ కంపెనీని స్థాపించినట్లు తెలిసింది. జాక్ మా ప్రీ ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీ పేరు హంగ్‌ఝూ మా కిచెన్ ఫుడ్‌గా నిర్ణ‌యించారు. జాక్ మా స్వ‌స్ధ‌లం హంగ్‌ఝూ. అదే పేరును తన కొత్త బిజినెస్‌కు పెట్టారని తెలుస్తోంది. 

ఇదీ చదవండి: ఆ తేదీల్లో ఎక్కువ.. ఈ తేదీల్లో తక్కువ పుట్టినరోజులు!

ఈ కంపెనీ ప్రీ ప్యాకేజ్డ్ ఫుడ్స్‌, రెడీ మీల్స్‌, ఎడిబుల్ వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను విక్ర‌యిస్తుంది. కరోనా మ‌హ‌మ్మ‌రి అనంత‌రం ప్యాకేజ్డ్ ఫుడ్‌కు డిమాండ్ పెర‌గ‌డం, జీవన శైలి మార్పుల కార‌ణంగా జాక్ మా ఫుడ్ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్నట్లు స‌మాచారం. ఇక చైనాలో రాబోయే మూడేళ్లలో దేశీ రెడీ మీల్స్ ప‌రిశ్ర‌మ భారీగా వృద్ధి చెంద‌నుంద‌ని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement