మెటాతో ఫ్లిప్‌కార్ట్‌ భాగస్వామ్యం | Flipkart join Meta affiliate programme to expand creator-led shoppings | Sakshi
Sakshi News home page

మెటాతో ఫ్లిప్‌కార్ట్‌ భాగస్వామ్యం

Jun 10 2026 4:13 AM | Updated on Jun 10 2026 7:25 AM

Flipkart join Meta affiliate programme to expand creator-led shoppings

ఫేస్‌బుక్‌ రీల్స్, పోస్టుల నుంచే నేరుగా కొనుగోళ్లు 

కంటెంట్‌ క్రియేటర్లకు కమీషన్‌ ఆధారిత ఆదాయం 

తొలుత ఫేస్‌బుక్‌లో.. త్వరలో ఇన్‌స్ట్రాగ్రామ్‌కు విస్తరణ

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ–కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్, సోషల్‌ మీడియా దిగ్గజం మెటాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. సోషల్‌ మీడియా వేదికల ద్వారా క్రియేటర్‌ ఆధారిత షాపింగ్‌ను ప్రోత్సహించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని తెలిపింది. 

ఇందులో భాగంగా కంటెంట్‌ క్రియేటర్లు ఫ్లిప్‌కార్ట్, మింత్రా వేదికలపై లభ్యమయ్యే ఉత్పత్తులను గుర్తించి, వాటిని నేరుగా తమ ఫేస్‌బుక్‌ పోస్టులు, రీల్స్‌లో ట్యాగ్‌ చేస్తారు. వినియోగదారులు ఆ ఉత్పత్తి ట్యాగ్‌లపై ట్యాప్‌ చేసి నేరుగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా జరిగే ప్రతి విక్రయంపై క్రియేటర్లకు కమీషన్‌ లభిస్తుందని సంస్థ వెల్లడించింది. ఈ సేవలను తొలుత ఫేస్‌బుక్‌లో అందుబాటులోకి తెచ్చి, తదుపరి దశలో ఇన్‌స్ట్రాగామ్‌కు విస్తరించనున్నారు. 

మారుతున్న కొనుగోలు ధోరణులు: ‘‘భారతీయ రిటైల్‌ రంగంలో జెన్‌ జెడ్‌ కొనుగోలు ధోరణులను ఫ్లిప్‌కార్ట్‌ రెండేళ్ల క్రితమే గుర్తించింది. ప్రస్తుతం కొనుగోలుదారులు సెర్చ్‌ బార్‌ల కంటే సోషల్‌ మీడియా ఫీడ్స్‌ ఆధారంగానే ఉత్పత్తులను ఎంపిక చేసుకుంటున్నారు. క్రియేటర్లే కొత్త తరహా డిజిటల్‌ దుకాణాలుగా అవతరిస్తున్నారు. ఈ క్రమంలో మెటాతో కుదిరిన భాగస్వామ్యం కంటెట్‌ క్రియేటర్లను వ్యాపారవేత్తలుగా మార్చడమే కాకుండా, బ్రాండ్‌లు వినియోగదారులకు మరింత చేరువ అవుతాయి’’ అని ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ సీఎఫ్‌వో రవి అయ్యర్‌ తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement