అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్ట్‌మార్ట్ ఇంటర్నేషనల్ మూడో త్రైమాసికంలో పటిష్టమైన ఆర్థిక ఫలితాలు సాధించడంలో భారత విభాగం ఫ్లిప్‌కార్ట్ కీలకంగా నిలిచింది. ఫ్లిప్‌కార్ట్ ’బిగ్ బిలియన్ డే’ సేల్స్‌ని నిర్వహించిన సమయం తమ సంస్థ ఆదాయాల వృద్ధికి సానుకూలంగా దోహదపడిందని వాల్‌మార్ట్ తెలిపింది.
ఫిబ్రవరి–జనవరి వ్యవధిని కంపెనీ ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. దీని ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంతర్జాతీయంగా వాల్‌మార్ట్ ఆదాయం 179.5 బిలియన్ డాలర్లుగా నమోదైంది. క్యూ3లో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సానుకూలంగా ఉన్నప్పటికీ, క్యూ4లో వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశంఉందని వాల్‌మార్ట్ తెలిపింది.
ఈ ఏడాది సెపె్టంబర్ 23 నుంచి అక్టోబర్ 2 వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్ నడిచింది. 2018లో 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ 77 శాతం వాటా కొనుగోలు చేసింది. తర్వాత దాన్ని 80 శాతానికి పెంచుకుంది.


