
క్రెడిట్ కార్డుల వినియోగం ఈ రోజుల్లో సర్వ సాధారణం అయిపోయింది. ఉద్యోగస్తులు మాత్రమే కాకుండా, వ్యాపారవేత్తలు సైతం వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే మనదేశంలో.. క్రెడిట్ కార్డు ఎప్పుడు ప్రారంభమైందనే విషయం బహుశా కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను తెలుసుకుందాం.
1980లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. మొదటి క్రెడిట్ కార్డును జారీ చేసింది. దీనిని సెంట్రల్ కార్డు అని పిలిచేవారు. ఇది వీసా నెట్‌వర్క్ కింద ఉండేది. దీన్ని బట్టి చూస్తే.. ఇండియాలో క్రెడిట్ కార్డు ప్రారంభమైన దాదాపు 45 సంవత్సరాలైందన్నమాట.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. ప్రస్తుతం, భారతదేశంలో 11 కోట్లకు పైగా క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఇందులో రెగ్యులర్ కార్డులు, ట్రావెల్ కార్డులు, లైఫ్ స్టైల్ కార్డులు, ఫ్యూయెల్ కార్డులు, సెక్యూర్ కార్డులు యూపీఐ కార్డులు వంటివి అనేకం ఉన్నాయి. వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా.. కావలసిన క్రెడిట్ కార్డులను ఎంచుకుంటారు.
ఇదీ చదవండి: బిట్‌కాయిన్ సరికొత్త రికార్డ్.. ఆల్‌టైమ్ గరిష్టాలకు చేరిన ధర
ఒకప్పుడు.. పెద్ద బ్యాంకులు మాత్రమే, క్రెడిట్ స్కోర్‌ల ఆధారంగా క్రెడిట్ కార్డులను జారీ చేసేవి. కానీ ఇప్పుడు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి చిన్న ఫైనాన్స్ బ్యాంకులు కూడా ఈ కార్డులను జారీ చేస్తున్నాయి. దీంతో క్రెడిట్ కార్డులను వినియోగించేవారి సంఖ్య బాగా పెరిగింది.