అనలాగ్ పన్నీర్‌పై నిషేధం | Fake Paneer Alert FDA Bans Analog Paneer for 1 Year Health Risks Fine Details | Sakshi
Sakshi News home page

అనలాగ్ పన్నీర్‌పై నిషేధం

Aug 22 2026 12:37 PM | Updated on Aug 22 2026 12:39 PM

Fake Paneer Alert FDA Bans Analog Paneer for 1 Year Health Risks Fine Details

కల్తీ ఆహార ఉత్పత్తులు, నకిలీ డెయిరీ పదార్థాల బారి నుంచి ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆహార భద్రత ప్రాధికారిక సంస్థ (ఎఫ్‌డీఏ) విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. పాలు, పాల పదార్థాల స్థానంలో వృక్షసంబంధిత కొవ్వులు (పాల్మ్ ఆయిల్), మైదా, స్టార్చ్, ఎమల్సిఫైయర్లు ఉపయోగించి కృత్రిమంగా తయారుచేసే ‘అనలాగ్ పన్నీర్’ (కృత్రిమ/నాన్-డెయిరీ పన్నీర్) తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలపై ఏడాది పాటు పూర్తిస్థాయి నిషేధం విధిస్తూ నిర్ణయం వెలువడింది.

వినియోగదారుల హక్కులు - ఆరోగ్య సమస్యలు

సాధారణంగా స్వచ్ఛమైన పన్నీర్ పాలలోని ప్రొటీన్లు, క్యాల్షియం కలిగిన అత్యంత పోషకాహారం. అయితే, ఖర్చు తగ్గించుకోవడమే లక్ష్యంగా అనేక హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సర్వీసులు, క్లౌడ్ కిచెన్లు కస్టమర్లకు తెలియకుండా అనలాగ్ పన్నీర్‌ను అసలైన పన్నీర్‌గా వడ్డిస్తున్నాయి. ఇది ఆహార భద్రత, ప్రమాణాల చట్టం ప్రకారం తీవ్రమైన అనుచిత వ్యాపార విధానం కిందకు వస్తుంది. నాసిరకం నూనెలు, ప్రాసెస్ చేసిన కెమికల్స్ వాడటం వల్ల గుండె సంబంధిత సమస్యలు, కొలెస్ట్రాల్ పెరగడం, జీర్ణకోశ వ్యాధులు వస్తాయని పోషకాహార నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కఠిన చర్యలు.. జరిమానాలు

వినియోగదారులను మోసం చేస్తూ అనలాగ్ పన్నీర్‌ను అసలు పన్నీర్‌గా విక్రయించే రెస్టారెంట్లు, వ్యాపారులపై అధికారులు సర్‌ప్రైజ్‌ రైడ్లు నిర్వహించనున్నారు. ఈ నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారికి చట్టపరంగా ఆరు నెలల నుంచి జీవిత ఖైదు వరకు శిక్షలతో పాటు రూ.10 లక్షల వరకు భారీ జరిమానా విధించే అవకాశముంది. ఇటీవల నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అనలాగ్ ఉత్పత్తుల విక్రయాలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి స్పష్టత కోరడం ఈ అంశం ప్రాధాన్యతను చాటుతోంది.

ప్రజలు తాము కొనుగోలు చేసే పన్నీర్ నాణ్యతను గుర్తించి గుర్తింపు పొందిన బ్రాండ్లు, సురక్షితమైన ప్రదేశాల నుంచే కొనుగోలు చేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆహార భద్రతలో రాజీ పడేది లేదని, ప్రజారోగ్య రక్షణే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: వ్యాపార నిర్వహణలో భావోద్వేగాలు వద్దు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement