వ్యాపార నిర్వహణలో భావోద్వేగాలు వద్దు! | Fired Her Own Mom immediately creates high tension and intrigue | Sakshi
Sakshi News home page

వ్యాపార నిర్వహణలో భావోద్వేగాలు వద్దు!

Aug 22 2026 9:11 AM | Updated on Aug 22 2026 9:51 AM

Fired Her Own Mom immediately creates high tension and intrigue

వృత్తిపరమైన జీవితానికి, వ్యక్తిగత అనుబంధాలకు నడుమ స్పష్టమైన సరిహద్దులు ఎంత అవసరమో చెప్పే ఆసక్తికర సంఘటన ఇది. ముంబైకి చెందిన డిజిటల్ క్రియేటర్, పారిశ్రామికవేత్త అవంతి నగ్రాల్‌ తన తల్లిని బిజినెస్ మేనేజర్‌గా నియమించుకుంది. కేవలం రెండు వారాల్లోనే ఆ పదవి నుంచి తల్లిని తొలిగించినట్లు వెల్లడించిన వివరాలు ఇప్పుడు కార్పొరేట్, స్టార్టప్‌ వర్గాల్లో చర్చకు దారితీసింది.

హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేరడానికి ముందు సంగీతం, నాటకరంగం, వినోద రంగానికి సంబంధించిన ప్రోగ్రామ్‌లతో బిజీగా ఉన్న సమయంలో తన షెడ్యూళ్లు, ఒప్పందాలు, ఈమెయిళ్లు చూసుకోవడానికి అవంతి తన తల్లిని మేనేజర్‌గా నియమించుకున్నారు. విభిన్న రంగాల్లో అనుభవం ఉన్న తల్లి సరైన నిర్ణయాలు తీసుకోగలదని భావించినా అది రెండు వారాల కంటే ఎక్కువ కాలం సాగలేదు.

రక్షణే అడ్డంకిగా మారిన వేళ

తల్లిని బాధ్యతల నుంచి తప్పించడానికి కారణం ఆమె నిర్లక్ష్యం కాదని, కుమార్తెపై ఉన్న అమితమైన ప్రేమేనని అవంతి పేర్కొన్నారు. ‘నా తల్లి కెరీర్‌ను మేనేజ్ చేయడం లేదు, నాకు రక్షణగా నిలుస్తోంది’ అని గ్రహించడమే దీనికి ప్రధాన కారణం. రాత్రివేళల్లో జరిగే షోలు, తెలియని నగరాల్లో టూర్లు, భద్రత అంచనా వేయలేని ప్రదేశాలకు వెళ్లే అవకాశాలను తల్లి తిరస్కరించడం వల్ల వ్యాపార పురోగతికి అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో బాధ్యతల నుంచి తల్లిని తప్పించి ప్రొఫెషనల్ ఏజెన్సీలను ఆశ్రయించాల్సి వచ్చింది.

సృజనాత్మక రంగంలో మౌలిక వసతుల కొరత

ఈ అనుభవం ద్వారా క్రియేటివ్ రంగానికి చెందిన వారు ఎదుర్కొంటున్న ప్రధాన లోపాన్ని అవంతి ఎత్తిచూపారు. భారతదేశంలో కళాకారులకు, స్వతంత్ర క్రియేటర్లకు వృత్తిపరమైన మేనేజ్‌మెంట్ సపోర్ట్, కాంట్రాక్ట్ చర్చలు నడిపే సరైన వ్యవస్థలు లేకపోవడంతో చాలామంది బంధువులు లేదా స్నేహితులపైనే ఆధారపడుతున్నారు. ఇది తరచూ వ్యక్తిగత సంబంధాలు దెబ్బతినడానికి లేదా వ్యాపార నష్టాలకు దారితీస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏ ప్రొఫెషనల్ వ్యాపారంలోనైనా భావోద్వేగాల కంటే ప్రాక్టికాలిటీ, మార్కెట్ అవసరాలు ముఖ్యాంశాలకు పెద్దపీట వేయాలి.

ఇదీ చదవండి: ఓణం పండగొచ్చె.. టీ ధరలకు రెక్కలొచ్చె!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement