ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా డౌన్‌.. యూజర్ల గగ్గోలు | Facebook And Instagram Down For Thousand Of Users Globally, More Details Inside | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా డౌన్‌.. యూజర్ల గగ్గోలు

Published Wed, May 15 2024 1:39 PM

Facebook Instagram down for many users globally

ప్రముఖ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లు ఫేస్‌బుక్‌ (Facebook), ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) స్తంభించాయి. అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. మెటా యాజమాన్యంలోని ఈ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యూజర్లకు పని చేయలేదు.

ఇన్‌స్టాగ్రామ్‌ను యాక్సెస్ చేస్తున్నప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు యూజర్ల నుంచి 18,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు డౌన్‌డెటెక్టర్ డేటా చెబుతోంది. వీరిలో 59 శాతం మంది యాప్‌ని యాక్సెస్ చేస్తున్నప్పుడు సమస్యలను ఎదుర్కొన్నారు. 34 శాతం మంది సర్వర్ కనెక్షన్ సమస్యలు, 7 శాతం మంది లాగిన్ చేయడంలో సమస్యలు ఎదుర్కొన్నారు.

యూజర్లతోపాటు ఇతర మూలాల ద్వారా పరిస్థితిని తెలుసుకుని డౌన్‌డెటెక్టర్ అంతరాయాలను ట్రాక్ చేస్తుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ సేవల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కొంతమంది యూజర్లు ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో అసహనం వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ మానిటరింగ్ గ్రూప్ నెట్‌బ్లాక్స్ రెండు సామాజిక వెబ్‌సైట్‌లు (ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌) ప్రస్తుతం 'అంతర్జాతీయ అంతరాయాలను' ఎదుర్కొంటున్నాయని ఒక పోస్ట్‌లో పేర్కొంది.

Advertisement
Advertisement