
టెక్నాలజీ పెరుగుతోంది.. పేమెంట్ విధానం చాలా సులభతరం అవుతోంది. ఇప్పటికే జేబులో డబ్బులు పెట్టుకునే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఫోన్ ఉంటే చాలు.. యూపీఐ ద్వారా ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఫోన్ కూడా అవసరం లేకుండా డబ్బు చెల్లించే విధానం అమలులోకి వచ్చింది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. దుబాయ్ షాపింగ్ మాల్‌లో ఒక వ్యక్తి రెండు జ్యూస్ బాటిల్స్ తీసుకున్నాడు. తరువాత అమౌట్ చెల్లించడానికి వెళ్ళాడు. అయితే ఈ వ్యక్తి డబ్బు చెల్లించడానికి క్యాష్ కార్డు లేదా యూపీఐ వంటి వాటిని ఉపయోగించలేదు. పక్కనే ఉన్న మిషన్ ముఖాన్ని స్కాన్ చేస్తుంది. వెంటనే.. పేమెంట్ చెల్లింపులు పూర్తయినట్లు కనిపిస్తుంది.
ఇదీ చదవండి: ఒక్క ఫోటో.. డౌన్‌లోడ్ చేశారో?.. ఖాతా మొత్తం ఖాళీ!
ఈ వీడియో చాలామంది నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. పేస్ రికగ్నైజ్ ద్వారా పేమెంట్ చెల్లింపులు చాలా కొత్తగా అనిపించాయి. ఈ విధానం సమయాన్ని మరింత ఆదా చేస్తుంది. షాపింగ్ చేయాలంటే.. ప్రత్యేకంగా కార్డ్స్ లేదా మొబైల్ వంటివి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పేస్ రికగ్నైజ్ పేమెంట్ విధానం.. భారతదేశంలో అమలులో లేదు.
ये दुबई का एक मॉल है जहां पेमेंट करने के लिए कैश,कार्ड और UPI की कोई जरुरत नहीं है।
यहां पेमेंट आपके चेहरे की पहचान से ही हो जाती है।
बस आप पेमेंट मशीन के सामने खड़े हो जाएं मशीन चेहरे की पहचान करेगा जितनी भी पेमेंट होगी वो आपके बैंक से कट जायेगी।
From - Hassan Alblooshi pic.twitter.com/muR5WQRxcL— Dr. Sheetal yadav (@Sheetal2242) May 25, 2025