ఎగుమతిదార్లకు అప్పు ఇవ్వాలంటూ సూచన.. ఎందుకంటే.. | Sakshi
Sakshi News home page

Houthi Attacks: ఎగుమతిదార్లకు అప్పు ఇవ్వాలంటూ సూచన.. ఎందుకంటే..

Published Thu, Jan 18 2024 8:50 AM

Exporters Need More Money Due To Transportation - Sakshi

ఎర్ర సముద్ర సంక్షోభం నేపథ్యంలో సరుకు రవాణా వ్యయాలపరంగా సమస్యలు ఎదుర్కొంటున్న ఎగుమతిదార్ల అవసరాలను పర్యవేక్షించాలని ఆర్థిక శాఖల విభాగానికి (డీఎఫ్‌ఎస్‌) వాణిజ్య శాఖ సూచించింది. వారికి రుణలభ్యతపై దృష్టి పెట్టాలని పేర్కొంది.

వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్‌ బర్త్‌వాల్‌ నేతృత్వంలో బుధవారం జరిగిన అంతర్‌–మంత్రిత్వ శాఖల సమావేశంలో ఎగుమతిదారుల సమస్యలను చర్చించారు. డీఎఫ్‌ఎస్, షిప్పింగ్, విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖల అధికారులు ఇందులో పాల్గొన్నారు. అరేబియా మహాసముద్రంలో నిఘాను మరింత పటిష్టం చేసినట్లు రక్షణ శాఖ తెలిపిందని ఈ సందర్భంగా సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

ఇదీ చదవండి: బుల్లెట్ రైలు ప్రాజెక్టు దక్కించుకున్న కంపెనీ ఇదే..

ఎర్ర సముద్రం గుండా ప్రయాణించే నౌకలపై హౌతీ మిలిటెంట్ల దాడుల కారణంగా వేరే మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుండటం వల్ల ఎగుమతిదారులకు వ్యయాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అన్ని వివరాలను సేకరిస్తున్నామని, త్వరలోనే అంతర్‌–మంత్రిత్వ శాఖల గ్రూప్‌ మరోసారి సమావేశమవుతుందని అధికారి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement