ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 3.0 వెర్షన్‌లో మెగా పునరుద్ధరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలు లక్ష్యంగా కార్యక్రమాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. 12 శాతం ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ పరిమితిని తొలగించడంతో సహా ఈపీఎఫ్‌వో సేవల్లో భారీ సంస్కరణలను కార్మిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది.
ఉద్యోగుల 12 శాతం కాంట్రిబ్యూషన్ పరిమితిని ఈపీఎఫ్‌ఓ సమీక్షించే అవకాశం ఉందని ఈటీ నౌ మూలాధారాలను ఉటంకిస్తూ రిపోర్ట్ చేసింది. ఉద్యోగులు తమ కాంట్రిబ్యూషన్‌ను పెంచుకోవడం ద్వారా మరింత సొమ్మును పీఎఫ్‌కు జమ చేసుకునేందుకు వీలు కలగనుందని నివేదిక పేర్కొంది. అయితే, యాజమాన్యం వంతుగా జమ చేసే మొత్తం ఉద్యోగి జీతంపై ఆధారపడి ఉంటుంది.
మొత్తంమీద, ఈపీఎఫ్‌వో తీసుకుంటున్న చర్యలను ఉద్యోగుల పొదుపును పెంచే ప్రయత్నంగా చూడవచ్చు. అదనంగా ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్‌ను వారి సమ్మతితో పెన్షన్‌గా మార్చడానికి అనుమతించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. అంటే ఏ సమయంలోనైనా ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ మొత్తాన్ని పెన్షన్‌గా మార్చుకునే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment