టెస్లా కారు వచ్చేస్తోంది.. 15న ముంబైలో  మొదటి స్టోర్‌ ప్రారంభం  | Elon Musk Tesla To Open First India Store In Mumbai On 15 July 2025, Watch Video For More Details | Sakshi
Sakshi News home page

టెస్లా కారు వచ్చేస్తోంది.. 15న ముంబైలో  మొదటి స్టోర్‌ ప్రారంభం 

Jul 12 2025 4:07 AM | Updated on Jul 12 2025 3:52 PM

Elon Musk Tesla to open first India store in Mumbai on 15 july 2025


న్యూఢిల్లీ: అమెరికన్‌ ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా వచ్చే వారం భారత మార్కెట్లో లాంఛనంగా అడుగుపెట్టనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో జూలై 15న దేశీయంగా తొలి స్టోర్‌ ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను ఎంపిక చేసిన ప్రముఖులకు టెస్లా పంపించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే తొలి కార్ల సెట్‌ను తమ చైనా ప్లాంటు నుంచి కంపెనీ ఎగుమతి చేసినట్లు వివరించాయి. 

ఇవి మోడల్‌ వై రియర్‌–వీల్‌ డ్రైవ్‌ ఎస్‌యూవీలై ఉంటాయని తెలిపాయి. టెస్లా ఇండియా గత నెలలో ముంబైలోని లోధా లాజిస్టిక్స్‌ పార్క్‌లో 24,565 చ.అ. వేర్‌హౌస్‌ స్థలాన్ని అయిదేళ్లకు లీజుకు తీసుకుంది. యూరప్, చైనా మార్కెట్లలో తమ కార్ల విక్రయాలు నెమ్మదిస్తున్న తరుణంలో భారత మార్కెట్లోకి టెస్లా ఎంట్రీ ఇస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.   


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement