Elon Musk Twitter Deal: ఎలాన్‌ మస్క్‌పై దావా వేస్తాం: ట్విట్టర్‌

Elon Musk To Pay 1 Billion As Deal Termination Fee To Twitter - Sakshi

ట్విట్టర్‌ కొనుగోలు రద్దు అంశం ఎలన్‌ మస్క్‌ను మరింత చిక్కుల్లో పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన మస్క్‌..ట్విట్టర్‌కు భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

44బిలియన్ల ట్విట్టర్‌ డీల్‌ను రద్దు చేసుకుంటున్నట్లు మస్క్‌ ప్రకటించారు. ఆ ప్రకటనపై ట్విట్టర్‌ ఛైర్మన్‌ బ్రెట్ టేలర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. దీంతో పాటు యూఎస్‌ సెక్యూరిటీ ఎక్ఛేంజ్‌ కమిషన్‌(ఎస్‌ఈసీ)నిబంధనలకు అనుగుణంగా మస్క్‌ 1బిలియన్‌ డాలర్ల నష్ట పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మస్క్‌ ఎస్‌ఈసీకి లోబడి ట్విట్టర్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అతిక్రమిస్తే 1 బిలియన్‌ డాలర్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.  
 
నేను అప్పుడే చెప్పా
సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫామ్‌ను కొనుగోలు చేయాలంటే తానే సొంతంగా 21బిలియన్ల ఈక్విటీని చెల్లించాల్సి ఉంటుందని మస్క్‌ చెప్పారు. అందుకే ఫేక్‌ అకౌంట్‌ల నుంచి వచ్చే ట్రాఫిక్‌ గురించి ట్విట్టర్‌ వివరణ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. లేదంటే ట్విట్టర్‌ను కొనే సాహసం చేయనని అన్నారు. దీనిపై ట్విటర్‌ యాజమాన్యం స్పందిస్తూ తమ సోషల్‌ మీడియాలో మొత్తం 5శాతం ఫేక్‌ అకౌంట్‌లు ఉన్నాయని తెలిపింది. కానీ 20 శాతం వరకు ఫేక్‌ ఖాతాలు ఉన్నాయంటూ.. ఫేక్‌ విషయంలో స్పష్టత ఇవ్వకపోతే కొనుగోలు వ్యవహారం ముందుకు వెళ్లదంటూ ఎలాన్‌ మస్క్‌ గతంలోనే చెప్పాడు. తాజా ఎలన్‌ మస్క్‌ నిర్ణయం ఫేక్‌ అకౌంట్లపై స్పష్టత లేనందు వల్లేనని,అదే కొలిక్కి వస్తే ట్విట్టర్‌  కొనులోప్రక్రియ ముందుకు సాగుతుందని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top