ఇషితా సల్గావ్కర్ ఎవరు.. అంబానీతో సంబంధం ఏంటి? | Sakshi
Sakshi News home page

ఇషితా సల్గావ్కర్ ఎవరు.. అంబానీతో సంబంధం ఏంటి?

Published Thu, Dec 28 2023 6:13 PM

Do You Know Mukesh Ambani Niece Isheta Salgaocar  - Sakshi

భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత 'ముఖేష్ అంబానీ' గురించి తెలిసిన చాలా మందికి, ఆయన మేనకోడలు 'ఇషితా సల్గావ్కర్' (Isheta Salgaocar) గురించి తెలియకపోవచ్చు. వ్యాపార రంగంలో తనదైన గుర్తింపు పొందిన ఈమె గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఎవరీ ఇషితా సల్గావ్కర్?
ఇషితా సల్గావ్కర్.. దీప్తి సల్గావ్కర్, దత్తరాజ్ సల్గావ్కర్ దంపతుల కుమార్తె. ఈమె స్వయానా ముకేశ్ అంబానీకి మేనకోడలు. ఎందుకంటే ఇషితా తల్లి 'దీప్తి సల్గావ్కర్' ధీరూభాయ్ అంబానీ కుమార్తె.. ముకేశ్ అంబానీ సోదరి.

నిజానికి ముకేశ్ అంబానీ మేనకోడలుగా కాకుండా వ్యాపార కార్యకలాపాలు, దాతృత్వ కార్యక్రమాలతోనే సుపరిచితం అయింది. ఈమె 2016లో నీరవ్ మోదీ తమ్ముడు నీషాల్ మోదీని వివాహం చేసుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిరువురు విడిపోయారు. ఆ తరువాత ఇషితా బిజినెస్ టైకూన్ లక్ష్మీ నివాస్ మిట్టల్‌ మేనల్లుడు 'అతుల్య మిట్టల్‌'తో ప్రేమలో పడింది. వీరిద్దరూ 2022లో వివాహం చేసుకున్నారు.

అంబానీ కుటుంబంలోని తన బంధువుల మాదిరిగా కాకుండా.. ఇషితా చదువుకునే రోజుల నుంచి గొప్ప విజయాలను సాధించింది. ఈమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన తరువాత సల్గావ్కర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కార్పొరేట్ డెవలప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తోంది.

ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ కారు - సింగిల్ ఛార్జ్‌తో 800కిమీ రేంజ్

ఆమె తల్లి దీప్తి సల్గావ్కర్ మాదిరిగానే.. ఇషితా సల్గావ్కర్ దాతృత్వ కార్యకలాపాలలో ఎక్కువగా పాల్గొనేది. ఇప్పటికే అనేక విద్య, ఆరోగ్య సంరక్షణ సంబంధిత కార్యకలాపాలకు పెద్ద ఎత్తున సాయం కూడా చేసింది. ప్రస్తుతం ఇషితా నికర విలువ గురించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు, అయితే కొన్ని మీడియా కథనాల ప్రకారం ఈమె నికర విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని, వ్యాపార రంగంలో కూడా బాగా రాణిస్తున్నట్లు సమాచారం.

Advertisement

తప్పక చదవండి

Advertisement