యాప్‌లు అవసరంలేని మొబైల్‌ ఫోన్‌.. ఎలా పనిచేస్తుందో తెలుసా.. | Deutsche Telekom Has Showcased Its Concept AI Phone, Know Its Full Details Inside - Sakshi
Sakshi News home page

App Less AI Phone Details: యాప్‌లు అవసరంలేని మొబైల్‌ ఫోన్‌.. ఎలా పనిచేస్తుందో తెలుసా..

Published Sat, Mar 2 2024 7:58 AM

Deutsche Telekom Has Showcased Its Concept AI Phone - Sakshi

మొబైల్‌ వాడుతున్నామంటే దాదాపు ఏదో ఒక యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి వాడుతుంటాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్‌ ఫోన్లన్నీ పూర్తిగా యాప్‌ల ఆధారంగానే పనిచేస్తున్నాయి. మెసేజింగ్‌, సోషల్‌ మీడియా, గేమింగ్‌, బ్యాంకింగ్‌ ఇలా ఏ అవసరానికైనా యాప్‌లు వాడాల్సి వస్తోంది. లేదా ఇంటర్నెట్‌నైనా ఉపయోగించాలి.

ఇందుకు పూర్తి భిన్నంగా తాజాగా డచ్‌ టెలికాం కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది. పూర్తిగా ఏఐ ఆధారంగా పనిచేసే ఈ మొబైల్‌ను ఎలాంటి యాప్‌లు అవసరం లేకుండా ఉపయోగించుకోవచ్చు. ఇటీవల బార్సిలోనాలో జరిగిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ (ఎండబ్ల్యూసీ)లో తమ టీ-ఫోన్‌ డివైజ్‌లోని ఈ కాన్సెప్ట్‌ను కంపెనీ వివరించింది.

వినియోగదారులు వాయిస్‌ రూపంలో ఇచ్చే కమాండ్లకు ఏఐ ఆధారిత అసిస్టెంట్‌ స్పందించేలా ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ కాన్సెప్ట్‌ను రూపొందించారు. నావిగేషన్‌, క్యాబ్‌, హోటల్‌ బుకింగ్‌.. ఇలా అన్ని పనులు ఎలాంటి యాప్‌లు, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అవసరం లేకుండానే పూర్తి చేయొచ్చు. క్లౌడ్‌ నుంచి ఏఐ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఇది సాధ్యం కానుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. మరోవైపు క్వాల్‌కామ్‌ కంపెనీతో జట్టు కట్టడం ద్వారా ఏఐను నేరుగా డివైజ్‌లోనే పొందుపర్చనుంది. కొన్ని అవసరాల కోసం ఆఫ్‌లైన్‌ ఫంక్షనాలిటీని జత చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. 

ఇదీ చదవండి: యాపిల్‌ కార్ల తయారీ లేనట్టేనా..?

రానున్న రోజుల్లో మొబ్స్‌ళ్లలో ఎవరూ యాప్‌లను ఉపయోగించబోరని ఎండబ్ల్యూసీలో ప్రసంగిస్తూ డచ్‌ టెలికాం కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ‘లార్జ్ లాంగ్వేజ్‌ మోడల్స్‌ (ఎల్‌ఎల్‌ఎం)’ త్వరలో అన్ని ఎలక్ట్రానిక్స్‌ పరికరాల్లో భాగమవుతాయని వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement