సైయెంట్‌ మోహన్‌ రెడ్డికి లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు | Cyient Founder Chairman Receives Lifetime Achievement Award | Sakshi
Sakshi News home page

సైయెంట్‌ మోహన్‌ రెడ్డికి లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

Nov 27 2024 7:34 AM | Updated on Nov 27 2024 7:34 AM

Cyient Founder Chairman Receives Lifetime Achievement Award

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇంటెలిజెంట్‌ ఇంజనీరింగ్‌ సేవల సంస్థ సైయెంట్‌ వ్యవస్థాపక చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌ రెడ్డికి ప్రతిష్టాత్మక లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ పురస్కారం లభించింది. ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాలకు ఆయన అందించిన సేవలకు గాను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ (ఐవోడీ) నుంచి గోల్డెన్‌ పీకాక్‌ అవార్డును అందుకున్నారు. 

ఇటీవల లండన్‌లో జరిగిన ఐవోడీ వార్షిక సదస్సులో దీన్ని ప్రదానం చేశారు. మోహన్‌ రెడ్డి గతంలో నాస్కామ్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. టీ–హబ్‌ ఫౌండింగ్‌ డైరెక్టర్లలో ఆయన ఒకరు కాగా, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ రూర్కీ గవర్నర్స్‌ బోర్డ్‌లకు చైర్మన్‌గా ఉన్నారు. కార్పొరేట్‌ రంగంలో అత్యుత్తమ ప్రమాణంగా గోల్డెన్‌ పీకాక్‌ అవార్డులకు అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement