అమెరికా వదిలి ఇండియాకు.. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి ఇతడొక వారధి!

CR Anandakrishnan Helps Father Run Rs 26473 Crore Company - Sakshi

ఇటీవల ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన 100 మంది ప్రపంచ కుబేరుల జాబితాలో ఆఖరి (100వ) స్థానంలో నిలిచిన కేపీఆర్ మిల్ ఛైర్మన్ 'రామసామి' (Ramasamy) ధనవంతుల లిస్ట్‌లో చేరిన మొదటి రైతు బిడ్డగా చరిత్ర సృష్టించాడు. అప్పు చేసి వేలకోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించిన 'రామసామి' వ్యాపారాన్ని చూసుకోవడానికి అతని కొడుకు 'ఆనందకృష్ణన్' విదేశాలను వదిలి ఇండియా వచ్చేసాడు.

సంస్థ అభివృద్ధి కోసం తండ్రి బాటలోనే అడుగులు వేస్తున్న ఆనందకృష్ణన్.. కోయంబత్తూరులోని జీఆర్‌డీ కాలేజీలో బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్ డిగ్రీ, అమెరికాలోని ఫిలడెల్ఫియా యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసాడు.

విదేశాల్లో ఉన్నత చదువులు చదివిని ఆనందకృష్ణన్.. తన తండ్రి స్థాపించిన కుటుంబ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇండియా తిరిగి వచ్చాడు. కుటుంబ వ్యాపారాలను చూసుకోవడానికి విదేశాలను వదిలి వచ్చిన వారు ఇప్పటికే చాలామంది ఉన్నారు. ఈ జాబితాలో ఆనందకృష్ణన్ ఒకరుగా నిలిచాడు.

2001లో మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత, అతను 2002లో కేపీఆర్ గ్రూప్‌లో మేనేజ్‌మెంట్ టీమ్‌లో చేరాడు. అప్పటి నుంచి అతను గ్రూప్ అభివృద్ధికి కృషి చేసాడు. ఆ తరువాత 2008 నుంచి కంపెనీ 'ప్రెసిడెంట్' (ప్రాసెసింగ్ డివిజన్)గా పనిచేశాడు, 2011లో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాడు.

ఇదీ చదవండి: జాబ్ రిజైన్ చేస్తే రూ.4 లక్షలు - అమెజాన్ ఫౌండర్ అదిరిపోయే ఆఫర్!

కేపీఆర్ గ్రూప్ అభివృద్ధికి ఎన్నెన్నో కొత్త ఆలోచలను ప్రవేశపెట్టిన ఆనందకృష్ణన్ ప్రస్తుతం కర్ణాటకలోని ప్రాసెసింగ్ డివిజన్, గార్మెంట్ యూనిట్, కొన్ని స్పిన్నింగ్ యూనిట్లు, కో-జెన్ కమ్ షుగర్ ప్లాంట్ వంటి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. అంతే కాకుండా ఇతడు కోయంబత్తూరులో ఆడి, హార్లే డేవిడ్‌సన్ డీలర్‌షిప్‌లను కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top