
హైదరాబాదీ ఏజెంటిక్ ఏఐ సంస్థ కోవాసెంట్ టెక్నాలజీస్ తాజాగా అమెరికాకు చెందిన కోనాఏఐ, డీక్యూబ్ డేటా సైన్సెస్‌లో విలీనమైంది. ఎంటర్‌ప్రైజ్ రిస్క్ మేనేజ్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ తదితర విభాగాల్లో ఏజెంటిక్ ఏఐ వినియోగాన్ని మరింతగా పెంచేందుకు ఈ వ్యూహాత్మక విలీనం దోహదపడగలదని కోవాసెంట్ టెక్నాలజీస్ సీఎండీ సీవీ సుబ్రమణ్యం తెలిపారు.
ఇదీ చదవండి: బడ్జెట్ ధరలో మోటో 5జీ ఫోన్
ఏఐ ఆధారిత సర్వీసెస్ యాజ్ సాఫ్ట్‌వేర్ విభాగంలో అగ్రగామిగా ఎదిగేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. ఇకపై కోవాసెంట్‌కి అనిల్ కోనా సీవోవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా వ్యవహరిస్తారు. కోనాఏఐ, డీక్యూబ్ వ్యవస్థాపకుడు అయిన అనిల్‌కి ఫోరెన్సిక్ అనలిటిక్స్.. సైబర్ సెక్యూరిటీలో అపార అనుభవం ఉంది.