
ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ మోటోరొలా బడ్జెట్ ధరలో ‘మోటో జీ96’ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. రూ.17,999 ప్రారంభ ధరతో వస్తున్న ఈ బడ్జెట్ ఫోన్‌ను వినియోగదారులు ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఫోన్‌ను స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 256 జీబీ స్టోరేజ్‌తో మార్కెట్‌లోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభం
ఫీచర్లు..
144 హెచ్‌జెడ్ 3డీ కర్వ్‌డ్ పీఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌ని వాడారు. వెనుక 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ–700సీ కెమెరా ఉంది. 5,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128బీజీ స్టోరేజ్‌లతో 2 వేరియంట్లు ఉన్నాయి. ప్రారంభ ధర రూ.17,999గా ఉంది. ఈ జూలై 16 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరొలా వెబ్‌సైట్లతో పాటు రిటైల్ షాపుల్లో అమ్మకాలు ప్రారంభవుతాయి.