Elon Musk: ఎలన్‌ మస్క్‌పై దుమ్మెతిపోస్తున్న చైనా పౌరులు! ఎందుకంటే..

Chinese Citizens Slam Musk Online After Space Station Near Misses - Sakshi

Chinese Citizens Slam Musk Online After Space Station Near Misses: టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ను చైనా పౌరులు ఆన్‌లైన్‌లో దుమ్మెతిపోస్తున్నారు. తీవ్ర పదజాలంతో మస్క్‌పై చైనా దేశస్తులు విరుచుకుపడుతున్నారు. 

కారణం ఇదే..!
ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్‌  ఇంటెర్నెట్‌ సేవలను అందించేందుకు స్టార్‌లింక్‌ ప్రొగ్రాంను ఎలన్‌ మస్క్‌ ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే. స్పేస్‌ ఎక్స్‌ అంతరిక్ష సంస్థతో సుమారు 42 వేలకుపైగా స్టార్‌లింక్‌ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఫాల్కన్‌ రాకెట్‌ ద్వారా ఇప్పటికే 18 వందలకు పైగా స్టార్‌లింక్‌ శాటిలైట్లను స్పేస్‌ ఎక్స్‌ పంపింది. దశలవారీగా స్టార్‌లింక్‌ శాటిలైట్లను స్పేస్‌ ఎక్స్‌ పంపుతోంది.  కాగా ఈ మిషన్‌లో భాగంగా  2021లో జూలై 1 నుంచి అక్టోబర్‌ 21 సమయంలో స్టార్‌లింక్‌ శాటిలైట్స్‌ చైనా స్పేస్‌ స్టేషన్‌కు ప్రమాదాన్ని గురిచేసే అవకాశం ఏర్పడిందని చైనా అంతరిక్ష సంస్థ సోమవారం డిసెంబర్‌ 27న యూఎన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ఆ సమయంలో చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ అలర్ట్‌గా ఉండడంతో చైనా స్పేస్‌ స్టేషన్‌ కక్ష్యను కాస్త జరపడంతో పెద్ద ముప్పు నుంచి తృటిలో తప్పిందని పేర్కొంది. యూఎన్‌కు చైనా ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఇప్పడే వెలుగులోకి వచ్చింది. దీంతో చైనా పౌరులు స్పేస్‌ ఎక్స్‌ అధినేతపై సోషల్‌ మీడియాలో విరుచుకుపడుతున్నారు. రానున్న రోజుల్లో చైనా స్పేస్‌ స్టేషన్‌ టియాన్హేలోని మూడు మాడ్యూళ్లలో అతిపెద్దదైన టియాన్హేను ప్రయోగాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించింది. 2022 చివరి నాటికి స్టేషన్ పూర్తవుతుందని చైనా ప్రకటించింది.

 అమెరికన్‌ స్పేస్‌ వార్‌ఫేర్‌..!
చైనా చేసిన వ్యాఖ్యలపై స్పేస్‌ ఎక్స్‌ స్పందించలేదు. సోమవారం చైనా మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ విబోలో చైనా పౌరులు ఎలన్‌ మస్క్‌ ప్రయోగిస్తోన్న స్టార్‌లింక్ ఉపగ్రహాలను అంతరిక్ష వ్యర్థాల కుప్పతో పోల్చుతున్నారు. ఇంకొంతమందైతే..."అమెరికన్ స్పేస్ వార్‌ఫేర్ ఆయుధాలు" అని అభివర్ణించారు.

చదవండి: అంతరిక్షంలోకి యువరాజ్‌సింగ్‌ బ్యాట్‌..! తొలి వ్యక్తిగా యువీ రికార్డు..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top