వెహికల్‌ నెంబర్‌ ప్లేట్‌ నిబంధనలకు కేంద్రం సవరణలు

Centre Proposed To Allow Conversion Of Regular Vehicle Registrations Into Bharat Series - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ సిరీస్‌ (బీహెచ్‌) వాహన రిజిస్ట్రేషన్‌ విధానాన్ని మరింత విస్తరించేందుకు వీలుగా నిబంధనల్లో సవరణలను కేంద్ర రవాణా, రహదారుల శాఖ ప్రతిపాదించింది. 

ఇప్పటికే వివిధ రాష్ట్రాల పరిధిలో రిజిస్టర్‌ అయిన వాహనాలను భారత్‌ సిరీస్‌ కిందకు మార్చేందుకు అనుమతించనుంది. ప్రస్తుతం కొత్త వాహనాలే బీహెచ్‌ సిరీస్‌ కింద నమోదుకు అవకాశం ఉంది. బీహెచ్‌ సిరీస్‌ నిబంధనల్లో సవరణలతో కూడిన ముసాయిదా నోటిఫికేషన్‌ను కేంద్ర రవాణా, రహదారుల శాఖ విడుదల చేసింది.

బీహెచ్‌ సిరీస్‌ కింద నమోదైన వాహనాన్ని ఒక వ్యక్తి మరో వ్యక్తికి విక్రయించినప్పుడు.. ఇదే సిరీస్‌ కింద అర్హత ఉన్నా, లేకపోయినా కొనుగోలుదారు పేరిట వాహన రిజిస్ట్రేషన్‌ సాఫీ బదిలీకి అనుమతించే నిబంధనను కూడా ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రెగ్యులర్‌ రిజిస్ట్రేషన్‌ కింద ఉన్న వాహనాలు పన్ను చెల్లించడం ద్వారా బీహెచ్‌ సిరీస్‌కు మారొచ్చు. చట్టంలోని 48వ నిబంధనకు సవరణను ప్రతిపాదించారు.

బీహెచ్‌ సిరీస్‌ రిజిస్ట్రేషన్‌ కోసం నివాసం ఉండే చోట లేదంటే పనిచేసే ప్రాంతం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ రాష్ట్రాల పరిధిలో వాహన రిజిస్ట్రేషన్ల సాఫీ బదిలీకి, ఉద్యోగ రీత్యా వివిధ రాష్ట్రాల మధ్య మారే వారు.. వాహనాల రిజిస్ట్రేషన్‌ మార్చుకోవాల్సిన అవసరం లేకుండా బీహెచ్‌ సిరీస్‌ను గతేడాది సెప్టెంబర్‌లో బీహెచ్‌ సిరీస్‌ను కేంద్ర రవాణా శాఖ తీసుకురావడం గమనార్హం.    

చదవండి👉 'ఫాస్టాగ్‌' కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top