Sakshi News home page

నేష‌న‌ల్ పెన్ష‌న్ స్కీమ్‌పై కేంద్రం కీలక నిర్ణయం?

Published Wed, Jun 21 2023 9:57 PM

Centre Mulls Tweaks In Nps To Offer Assured Base Pensions To Govt Employees - Sakshi

వచ్చే ఏడాది లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం వర్సెస్‌ నేషనల్‌ పెన్షన్‌ స్కీం అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. పాత పింఛను విధానం కాకుండా ఇతర మార్గాలను అన్వేషించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.  

ఇందులో భాగంగా అమల్లో ఉన్న ఎన్‌పీఎస్‌ పథకం కింద ఉద్యోగి రిటైర్‌ అయ్యాక చివరి వేతనంలో 40 - 45 శాతం పెన్షన్‌గా అందుకునేలా మార్పులు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. కొత్త పెన్షన్‌ విధానం అమలులో సాధ్యసాధ్యాలు, కేంద్ర రాష్ట్రాలపై రుణ భారం వంటి ఇతర అంశాలపై రివ్యూ జరిపేలా ఏప్రిల్‌ నెలలో కేంద్రం ప్రత్యేక కమిటీని నియమించింది.

తాజాగా, ఆ కమిటీ సభ్యులు కేంద్రానికి ఓ రిపోర్ట్‌ను అందించారు. దాని ఆధారంగా ఎన్‌పీఎస్‌ చందాదారులు ఉద్యోగం నుంచి రిటైర్‌ అయ్యాక ఆఖరి నెల జీతంలో 40 - 45 శాతం పెన్షన్‌గా వచ్చేలా హామీ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇక, ప్రస్తుతం అందుబాటులోకి ఉన్న ఎన్‌పీఎస్‌లో ఉద్యోగి తన వాటాగా 10 శాతం చెల్లించాలి. ప్రభుత్వం తన వాటాగా 14 శాతం చెల్లిస్తుంది. ఈ మొత్తాన్ని డెట్‌, ప్రభుత్వ సెక్యూరిటీల్లో మదుపు చేస్తారు. అయితే, ఎన్‌పీఎస్‌  కింద పెన్షన్‌ మొత్తానికి ఎలాంటి హామీ ఉండదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement